♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
వైకుంఠ ఏకాదశి సందర్బంగా జనవరి 10 వతేది ఉదయం రుద్రవరం మండలంలోని వాసాపురం వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలని భక్తులను ఆలయ కమిటీ అధ్యక్ష,ఉపాద్యక్ష,కోశాదికారులు ఎస్ మధుసూదన రెడ్డి,రంగనాయకులు, నరసింహులు, భక్తులను జనాస్త్రం ద్వారా కోరారు..వైకుంఠ ఏకాదశి రోజు జరిగే వేడుకలను వారు వివరించారు..
9వతేది గురువారం రాత్రి 12 గంటలకు అభిషేకం,ప్రత్యేక అలంకరణ
10 వతేది శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలనుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుని దర్శనం
10 వతేది ఉదయం 10 గంటలకు వాసాపుర వెంకటేశ్వర స్వామికి లక్ష్మిదేవి అమ్మవార్లకు సామూహిక కల్యాణ మహోత్సవం
సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వారి రదోత్సవ వేడుక..ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యాత శ్రీమాన్ హరి గ్రీవాచార్యులచే ఉదయం నుండి క్షేత్ర వైభవం స్వామి వైభవం ప్రవచనాలు జరుగుతాయి..ప్రత్యేక కల్యాణంలో పాల్గొనేవారు ఆలయ కమిటీ సభ్యలు అనుమతి పొందాల్సి ఉంటుంది..
వివరాలకు 9703719805,9494219808,9441040694 ను సంప్రదించాలి..ఆలయం సందర్శించే భక్తులకు ఉచిత భోజనం,అల్పాహారం ఏర్పాటు జరిగిందని వారు తెలిపారు..