♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ 30 ఏళ్ల జర్నలిజంచేసిన రవి మృతికి జనాస్త్రం సంతాపం
⇒ ఆరోగ్యం,కుటుంబంపై దృష్టిని సారించలేరు.
⇔ చివరిదశలో పాత్రికేయులు సమస్యలను ఎదుర్కుంటారు.
⇒ నామినేటెడ్ పోస్టుపై ఆశలేదు,చెయ్యలేను
వేలాదిమంది ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఈనాడు మాజీ పాత్రికేయడు రవిప్రకాష్ ఆనంద్ పదిరోజుల క్రితం జనాస్థ్రం ఎండి మారంరెడ్డి జనార్ధనరెడ్డితో జర్నలిజం గురించి ,ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించారు..ప్రధానంగా చాలామంది పాత్రికేయులు వృత్తి మీద చూపిన ఉత్సాహం కుటుంబంపై చూపరని అలాగే ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారని అలాంటి వారు చివరి దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆవేదన వ్యక్తంచేశారు..మూడింటిపై దృష్టిని సారించిన పాత్రికేయులు కొంతవరకు బాగుంటారని, అంతేకాక జర్నలిజం మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో చేస్తున్న ఒక భాగం ఆదాయంపై దృష్టిని సారించితే బాగుంటుందని లేని పక్షంలో చాలా కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు..
జనాస్త్రం …ఏం రవీ…కనబడటంలేదు
రవి…నేను అధిక సమయం బెంగుళూరులో కుమారుని దగ్గర ఉంటున్నాను
జనాస్త్రం…ఆరోగ్యం బాగుందా రవి
రవి....ఇప్పటికయితే బాగుంది..నీవుకూడా ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకో.నీకు పాత్రికేయులు అదిక సంఖ్యలో టచ్ లో ఉంటారు..వారికి కూడా చెబుతూ ఉండు..ఆర్ధికంగా బాగాలేని వారికి ఎవరితోొ ఒకరితో చెప్పి టెస్టింగులు చేపిస్తే బాగుంటుంది..ఎక్కువ నిర్లక్ష్యం చేస్తుంటారు..వయస్సులో కనపడదు..
జనాస్త్రం...మంత్రి పరూఖ్ గారితో టచ్ లో ఉన్నావా..
రవి…ఉన్నాను..బయట ఎక్కడ కనపడినా గతంలోని అభిమానం, ఆప్యాయతతో పలకరిస్తారు..ముందు ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు..అదే సంతోషం..ఈ రోజే మంత్రికి అగుపించాను..ఆరోగ్యం గురించే అడిగాడు..ఆతరువాత అప్పటి జర్నలిజం,ఇప్పటి జర్నలిజం గురించి,రాజకీయాల గురించి స్వల్ప సమయంలోనే మంత్రిగారు గుర్తుచేశారు..
జనాస్త్రం...మంత్రిపరూఖ్ గారికి పాత పాత్రికేయులపై అభిమానం బాగానే ఉంది..నీవుకూడా టచ్ లో ఉండు..ఆయన మైనారిటీ మంత్రి ..క్రిష్టియన్లు కూడా వస్తారు..అందువల్ల ఏదోఓక నామినేటెడ్ పోస్టు ఆయన పరిదిలో ఉంటుంది..అందుకే టచ్ లో ఉండు..
రవి...ఇప్పుడు మనం పదవులు చేసే పరిస్థితులలో లేము..పరూఖ్ కూడా మన మీద అభిమానం చూపుతారు..మన ఆరోగ్యాన్ని చక్కపెట్టుకునే విషయంలో ఆయన సహకారం పొందుదాం..అంతేలే అన్న అంతకంటే ఏమి పదవులు కావాలి
జనాస్త్రం..పోన్ చేస్తే ఎత్తుతూ ఉండు..
రవి...ఎత్తుతాను..ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటే ఎత్తను..ఇద్దరం కలిసి నాకు,నాకుటుంబానికి ప్రీతిపాత్రమైన కాటసాని రాంభూపాల్ రెడ్డి దగ్గరికి వెళ్లి వద్దాం..ఆయన ఓటమి చూసినదగ్గరనుంచి కలవలేదు.
జనాస్త్రం…సరేలే రవి..వెళదాం..