♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔ యాగంటి క్షేత్రంలో పూజల సమయాలు ఎపుడు సార్
⇒ అయోమయంలో భక్తులు
⇒ డబ్బులపై యావ తప్ప పూజలపై శ్రద్ద ఎక్కడ
⇒ ఆకాశదీపంతోపాటు అన్ని అందమైన బోర్డులే
దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన యాగంటి క్షేత్రంలో ఎండోమెంటు అధికారులకు ఆదాయంపై యావ తప్ప మరొకటి అగుపించడంలేదని ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు…ఆలయంలో జరిగే పూజలను భక్తులకు అందుబాటులో సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు..సంతేషమే..అయితే ఆకాశ దీపం లో పాల్గొనే భక్తులు 600 వందలు చెల్లించాలని అందమైన బోర్డులను ఆలయం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు..అయితే ఆకాశదీపం పూజ ఎన్నిగంటలకు జరుగుతుందన్న సమాచారం అందులో లేకపోవడంతో భక్తులు ఆగ్రహం చెందుతున్నారు..సాదారణంగా ఆకాశదీపం ప్రదోష వేళ అయిన సాయంత్రం ఆరుగంటల సమయంలో వెలిగిస్తారు..ఉదయం కూడా 6గంటల సమయం ఉంది..ఈ పూజ ఉదయం, సాయంత్రం చేస్తారా లేక సాయంత్రమే చేస్తారా అనే సందిగ్దం భక్తులలో నెలకొంది..అలాగే మహాన్యాసరుద్రాభిషేకానికి రూ.750 చెల్లించాలని ఏకాదశ రుద్రాభిషేకం కు రూ.1116 చెల్లించాలని అభిషేకంకు రూ.350 సేవాటికెట్లను చెల్లించాలని ప్రచారం చేస్తున్నారు..అయితే అందులో సోమవారమే పూజలు చేస్తారా లేక ప్రతిరోజు చేస్తారా చేస్తే ఏ సమయంలో చేస్తారు అనేది తెలియక గందరగోళంలో పడ్డారు..దీంతో జనాస్త్రం అదికారులను అడగడానికి ప్రయత్నంచేయగా సమాదానం ఇవ్వడానికి అందుబాటులో కి రాలేదు..