♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
జానాస్త్రం ఎపెక్ట్
⇒ హౌసింగ్ బోర్డు ప్రజలకు ఇక నోటెన్షన్
⇒ అవగాహన లేని నిర్ణయంతో రెండుకోట్ల ఆదాయం దూరం
⇒ 4.6 7 లక్షల జనాస్త్రంలో కధనానికి స్పందన
నంద్యాలజిల్లా కేంద్రంలోని హౌసింగు బోర్డులో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని జిల్లా కలెక్టరు రాజకుమారి గణియా తీసుకున్న నిర్క్షయం పట్ల హౌసింగు బోర్డు కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు..ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కారంచేస్తున్న కలెక్టరు గణియాకు ఇది పెద్ద సమస్యకాదని జనాస్త్రంలో కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే..ప్రసారమయిన కొన్ని గంటలకే ఈ నిర్ణయం తీసుకుంటూ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు..గత ఆరు ఏడు మాసాలనుండి హౌసింగు బోర్డులో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి..రిజిష్టరు కార్యాలయానికి రావలసిన ఆదాయం దాదాపు రూ.2కోట్లు ఆగిపోయింది..దీనితో ప్రజలు ఆందోళన వ్యక్తంచేయడమే కాకుండా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ఆశ్రయించిన విషయాన్ని జనాస్త్రం వివరిాంచింది.ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ 4.6లక్షల వ్యూస్ ను చేరుకున్న జనాస్త్రంకు హౌసింగు బోర్డుపై ప్రత్యేక దృష్టిని సారించినందుకు కాలనీకిచెందిన ఎన్ హెచ్ శంకరరెడ్డి, ఉయ్యలవాడ వెంకటేశ్వరరెడ్డి, జంబులదిన్నె గోవిందరెడ్డి తదితరులు కృతగ్నతలు తెలిపారు..