నంద్యాల జనవరి 07(జనాస్త్రం);
నంద్యాల జిల్లా పరిదిలోని 7 నియోజకవర్గాలలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి కంట్రిబ్యూషన్ చెల్లించకుండానే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ద్వారా కృషిచేయాలని ఎంఎల్ఎ కాటసాని రాంభూపాల్ రెడ్డికి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు.వైయస్ ఆర్ సిపి జిల్లా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఈ మేరకు నంద్యాల వైైసిపి కార్యాలయంలో కలిసి జర్నలిస్టు సంఘనేతలు కలిశారు..ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు మూడుసెంట్ల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన దరఖాస్తులను ఆహ్వానించిందని ఈమేరకు పలు షరతులతోపాటుగా జర్నలిస్టు వాటా క్రింద 40శాతం సొమ్ముచెల్లించాలన్న నిభందన ఉందన్నారు..40శాితం కాంట్రిబ్యూషన్ నిబందనతోపాటుగా ఇతరత్రా నిబందనలు తొలగించి అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటిస్థలం ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి ఒప్పించేందుకు కాటసాని కృషిచేయాలని ఈసందర్బంగా జర్నలిస్టులు కోరారు.. జర్నలిస్టుల వినతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తనవంతు జర్నలిస్టులకు మేలుజరిగేలా కృషిచేస్తానని వైయస్ ఆర్ సిపి జిల్లా కన్వీనర్,పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూల్ రెడ్డి హామీ ఇచ్చారు.కార్యక్రమంలో సంఘనేతలు సాయివర్మ, ప్రదీప్, కనకరాజు శిల్పాకేబుల్ స్టాపర్ మదు ఇతర జర్నలిస్టలు ఉన్నారు..