♦జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦ఉమ్మడి రాష్ట్రాలలో పెడకంటి రెడ్ల ప్లాట్ పాంకు యత్నం♦
♦రెండు రాష్ట్రాలను ప్రభావితంచేసే నేతలకు అధ్యక్ష,కార్యదర్శులగా పోస్టులు
♦పెడకంటి రెడ్లకు వైద్యంచేయడానికి డాక్టర్ ఇండ్ల మాదవరెడ్డి సిద్దం
చెప్పాడంటే …చేస్తాడనే నమ్మకం పెడకంటి సంఘం నాయకుడు రిటైర్డు వి ఆర్ ఓ, కుందూరు మోహనరెడ్డి కల్పిస్తున్నారు..ఆర్ధికంగా వెనుకబడిన పెడకంటి రెడ్లకు ఉడతా భక్తిగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఇందుకు ఒక ప్లాట్ పాం ను ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉమ్మడి రాష్ట్రాల పెడకంటి రెడ్డ సంఘాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు..ఇప్పటికే పలువురి అభిప్రాయాలను సేకరించారు..ఇంకా అభిప్రాయసేకరణ కొనసాగుతునే ఉంది..ఒకవైపు రెండు రాష్ట్రాలను ప్రభావితంచేసే పెడకంటి సంఘం అధ్యక్షుడిగా ఎంపికచేయడానికి మంతనాలు జరుపుతున్నారు..ఇందులో ఆర్దికంగా స్థితిమంతులు సంఘంకోసం మొహమాటంలేకుండా పోరాటంచేసే వారిని నియమించి వారి సహాయసహకారాలతో పేదపెడకంటి సంఘం సభ్యులకు సహాయం చేసే వారికి స్థానం కల్పించాలని నిర్ణయించారు. ఎవరిని అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా ఎంపికచేస్తే మేలు జరుగుతుంది అనేదానిపై ప్రజాప్రాయసేకరణ చేయాలని నిర్ణయించారు..ఈలోపే నంద్యాలపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని విద్యాసంస్థలను వైద్యసంస్ధలను తమ కుటుంబాలకు సహకరించాలని కోరుతున్నారు..ఇందులో భాగంగా నంద్యాలపట్టణంలోని రైతునగర్ కు వెళ్లే రహదారిలోె ఉన్న వరుణ్ ఆర్డోపెడిక్ వైద్యులు ఇండ్ల మాదవరెడ్డిని సంప్రదించారు..ఆయన అన్ని వర్గాలకు తమ వంతు వైద్యసహకారం అందిస్తున్నామని అందులో భాగంగా పెడకంటి పేదలకు 20 శాతం రాయితీతో వైద్యం చేస్తానని హామీ ఇచ్చారు..అలాగే ప్రముఖ వైద్యుడు చెప్పలి రాఘవేంద్రరెడ్డిని కూడా సంప్రదించారు..ఆయన కూడా సానుకూలంగా స్పందించారు..రెడ్లలో కాని ఇతర ప్రతిభావంతులు కాని పేద పెడకంటి రెడ్లకు సహాయం అందించడానికి ముందుకు వస్తే వారి సహాయం పొందడానికి సిద్దంగా ఉన్నామని మోహనరెడ్డి విలేఖరులకు తెలిపారు..ఒకరోజుతో ఈ కార్యక్రమం పూర్తికాదని దశల వారిగా మెజారిటీ రెడ్ల అభిప్రాయంతో ముందుకుసాగుతామని మోహనరెడ్డి అన్నారు..