♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦పదోన్నతిలో సుహాసినిరెడ్డిా
♦బైరెడ్డి సూచనకు స్పందించిన సంఘం
♦పోరాటాలే ఆమె పదోన్నతికి కారణం
♦♠♠నంద్యాలసభ విజయవంతంలో కీలక భూమిక
రాష్ట్ర రెడ్డి సంఘం మహిళా అద్యక్షురాలిగా సానంరెడ్డి సుహాసినిరెడ్డి ఎన్నికయ్యారు..రెండురోజుల క్రితం ఆంద్రప్రదేశ్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గ సమావేశం బెజవాడలో జరిగింది..విజయవాడలోె రాష్ట్ర అద్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో సమావేశం జరిగింది..ఈసమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయగా ఇంతకాలం ఉపాద్యక్షురాలిగా కొనసాగుతూ పెద్ద సమస్యలకోసం పోరాటాలు చేస్తున్న సుహాసినిరెడ్డిని పదోన్నతిపై మహిళా విభాగం అద్యక్షురాలిగా నియమించారు..నెలరోజుల క్రితం నంద్యాల కేంద్రంగా జరిగిన రాష్ట్ర సమావేశాన్ని మాజీ ఎంఎల్ఎ బైరెడ్డి రాజశేఖరరెడ్డి సహకారంతో విజయవంతంగా నిర్వహించడంలో సుహాసినిరెడ్డి కృషిచేశారు..దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డితోపాటు మరికొంతమంది నేతలు సుహాసినిరెడ్డి మహిళ అయినా పురుషులతో సమానంగా పెద్ద సమస్యలకోసం పోరాటాలు చేస్తున్నారని ఆమెకు సంఘంలో పదోన్నతి కల్పించాలని సురేస్ కుమార్ రెడ్డితోపాటు మరికొంతమంది నాయకులకు సూచించారు..దీంతో సుహాసినిరెడ్డికి పదోన్నతి లభిాంచిందని అన్నారు..నంద్యాలపట్టణంలోని భారతమాత గుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న సుహాసినిరెడ్డి మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రెడ్డిసంఘం సూచనలు పాటిస్తూ రెడ్డి మహిళలను ఐక్యపరుస్తూ వారి సమస్యల పరిష్కారంలో దృష్టిని సారిస్తానని అన్నారు..తనతోపాటు రాష్ట్ర అద్యక్షులుగా గంగుల కుంట నరేష్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రదానకార్యదర్శిగా నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఎంపిక అయ్యారని ఆమె అన్నారు..