♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦వడిబియ్యం కూడా
♦ఈ నెల 15 వ తేదీన
♦పూజలో పాల్గోన్న మహిళలకు శుభవార్తలు అందాయి
♦భక్తుల సహకారం కూడా అద్బుతం
ఎన్నో సంవత్సరాలనుంచి జరుగుతున్న సంతాన లక్ష్మి పూజ…………
దక్షిణ భారత దశంలోనే అత్యంత శక్తివంతమైన సుబ్రమణ్యేశ్వర క్షేత్రాలలో ఒకటైన నంద్యాల జిల్లా, పాణ్యం మండలం లోని శ్రీ కొత్తూరు సుబ్రమణ్యేశ్వర ఆలయంలో కార్తీక మాస సందర్బంగా ఈ నెల 15 వ తేదీన సంతాన లక్ష్మి పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రదాన అర్చకులు నారాయణ స్వామి, సురేష్ స్వామి లు విలేకరులకు తెలిపారు. ప్రదాన పూజారులు కంపమళ్ల పుల్లయ్య, వీరయ్య శర్మల ఆశీస్సులు,భక్తులు, ఈ.ఒ రామకృష్ణ సహకారంతో అనేక సంవత్సరాల నుంచి తమ ఆలయంలో ఈ పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పూజలో పాల్గొన్న సంతానం లేని మహిళలకు సంతానం కలిగినట్లు వారు తెలిపారు. గత యేడాది 2వేల మందికి సంతాన లక్ష్మి పూజ నిర్వహిాంచి వడిా బియ్యం పోశామన్నారు.. ఈ సారి ఎక్కువ మంది మహిళలు పాల్గోనే అవకాశం ఉందన్నారు..వారందరికి కూడా వడి బియ్యం పోసే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈపూజకు సహకారం అదించడానికి ముందుకు వస్తున్నారని అన్నారు..ఈ పూజలో పాల్గనే భక్తులకు ఉచిత అల్పాహారము మరియు బోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివరాలకు 9491851856, 8985285289, 9490641270, 8500292799 నెంబర్లకు సంప్రదించవచ్చని నారాయణ స్వామి, సురేష్ స్వామిలు తెలిపారు.