♦జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔కిలో రూ.500 నుంచి రూ..600 వరకు
⇔హైదరాబాదులో రూ.800 పైగా
⇔ఐనా కూలీలకు గిట్టని వైనం
చింతచిగురు ఒగురు చూడు …చిన్నదాని పొగురు చూడు అనే పాటను రాసిన కవిని ప్రస్తుత వేసవిలో ప్రజలు చర్చించుకుంటున్నారు..పదేళ్ల క్రితం ఉచితంగా అందిన చింతచిగురు ఏడాదికింత పెంచుకుంటూ ప్రస్తుతం కిలో రూ.500 నుండి రూ.600 వరకు గ్రామీణ ప్రాంతమైన నంద్యాలలోనే అమ్ముతున్నారు..హైదరాబాదులాంటి పట్టణాలలో అయితే రూ.800 నుండి 900 మద్యన కిలో చిగురును విక్రయిస్తున్నారు..గ్రామప్రాంతాలలోని చింతచెట్లు తగ్గి పోవడం కోశేవారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతుండటంతో చింత చిగురు ధర అమాంతం పెరిగిపోయింది..కూలీలకు కూడా ఈ ధర గిట్టుబాటు కావడంలేదు..ప్రమాదకరమైన చెట్లను ఎక్కి చిగురును కోయాలి..పదిచెట్లను ఎక్కి చిగురు కోస్తే తప్ప వారికి కూడా గిట్టుబాటు కావడంలేదు..వేసవి కాలంలో చింతచిగురు పప్పు,కారం తినడానికి ప్రజలు ఇష్టపడతారు.ఇళ్ల దగ్గరకు గంపలతో వచ్చే వారిసంఖ్య కూడా తగ్గిపోయింది..మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నారు..మొత్తం మీద చింతచిగురు ధర పెరగడం కలికాలం మహిమగా మహిళలు చర్చించుకుంటున్నారు..