♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔ముగుస్తున్న ప్రచారం
⇔ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా తాయిలాలు
⇔టిడిపి,వైయస్ ఆర్ సిపి తాయిలాలలో దోబూచులాట
⇔రూ.1000 నుంచి రూ.2000 వరకు
ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో సగానికి పైగా ఓటర్లు తాయిలాలపై దృష్టి సారించారు .నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 16లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంది .ఇందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, బిజెపి, జనసేన లు తమ పార్టీ మ్యానిఫెస్టోలను విడుదల చేశారు. అత్యధికంగా అన్ని పార్టీలు సంక్షేమంపై దృష్టి సారించారు .ఒకటి రెండు రోజులు మాత్రమే ఈ మేనిఫెస్టోలపై ప్రజలు చర్చించుకున్నారు. అయితే అన్ని పార్టీల అగ్ర నేతలు జగన్ చంద్రబాబు లు ప్రత్యర్థుల దగ్గర డబ్బులు ఉన్నాయని వాటిని తీసుకొని మంచివాడైనా తమ పార్టీకి ఓటు వేయమని ఓటర్లను కోరారు. దీంతో 20% మంది ఓటర్లకు పైగా తమ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి తెలుగుదేశం అభ్యర్థులు ఎంత మొత్తం ఇస్తారో అని చర్చించుకుంటున్నారు .ఒక పార్టీ 1000 నుండి 1500 వరకు మరో పార్టీ 2000 నుండి 2500 వరకు ఇవ్వచ్చని అంచనా వేస్తున్నారు .నాయకులు ఇంతవరకు చెప్పిన మాటలను విస్మరించి తాయిలాలపై దృష్టిని సారించడంతో ఎన్నికల మూడు మారిపోయిందని నంద్యాల,ఆళ్లగడ్డ.,బనగానపల్లె ,.పాణ్యం డోన్ ,నందికొట్కూర్, శ్రీశైలం నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇది కేవలం ఏడు నియోజకవర్గాల్లోనే కాదని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చర్చ సాగుతున్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.