♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔ప్రతి వాల్మీకి ఓటు వైఎస్ఆర్సిపి కి వేయిస్తా…!
⇔శ్రీశైలంలో చక్రపాణి అన్నకు మంచి మెజార్టీ వస్తుంది..
⇔జగన్ సీఎం కావాలి అంటూ ఐకమత్య ఫైట్ చేస్తున్నారు
వాల్మీకి సంఘం నాయకుడిగా కర్నూలు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమ లో భారీ పరిచయాలు ఉన్న జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ లాలు స్వామి ఎట్టకేలకు ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ప్రచారాన్ని కూడా శ్రీశైలం తో పాటు అన్ని నియోజకవర్గ వాల్మీకుల్లో తమ అనుచరులు శ్రేయోభిలాషులతో ఉదృతం చేశారు .గతంలో శ్రీశైలం వైఎస్ఆర్సిపి అభ్యర్థి చక్రపాణి రెడ్డి తో రాజకీయ విభేదాలు తలెత్తడంతో చక్రపాణి రెడ్డికి కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్సిపి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి నువ్వు రంగంలోకి దిగు,ఎవ్వరితో సంబంధం లేకుండా మేము నీకు జరిగిన నష్టాన్ని తొలగించడమే కాకుండా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగినట్లు లాలు అనుచరులు తెలిపారు. శ్రీశైలం అసెంబ్లీలో 20వేల మంది వాల్మీకి ఓటర్లు ఉన్నారని వారి దగ్గరికి వెళ్లి ముందుగా వైసీపీకి ఓటు వేయాలని కోరుతున్నట్లు జనాస్త్రంతో తెలిపారు. గతంలో లాగే ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వైఎస్ఆర్సిపి కి ఓటు వేయిస్తానని లాలు అన్నారు. కర్నూలు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బివై రామయ్య ఎంపిక చేయడంతో 14 అసెంబ్లీలోని అత్యధిక వాల్మీకులు వైఎస్ఆర్సిపి కి మొగ్గు చూపుతున్నారని ఇది వైసీపీకి ప్లస్ అయిందని లాలు వివరించారు. జగన్ విజయం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని లాలు తెలిపారు.