ల్యాండ్ మైన్ పై శిల్పా…పరూఖ్ లు

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి

#కత్తులు కడుపులో పెట్టుకుని కౌగలించుకుంటున్నారు

#సెల్ పోన్లలో లైవ్ ….రికార్డులు చేస్తున్న కోవర్టులు

#ఒకవైపు రిమూవ్ చేసుకుంటూ మరో వైపు వారిని ….

 

 

నంద్యాల రాజకీయంచేయాలంటే ఎవరికైనా గుండెకు బొచ్చు వచ్చి ఉండాలని మొదటినుండి జనాస్త్రం అభిప్రాయం..ఇదే అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తున్నారు.ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ ఇంచార్జిలుగా కొనసాగుతున్న శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి(వైసిపి),ఎన్ ఎండి పరూఖ్(టిడిపి)లు ల్యాండ్ మైన్ లను ఫేస్ చేస్తున్నారు..వీరిద్దరూ కూల్ కెప్టెన్ లు కావడంతో వాటిని నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు..వీరిద్దరి వెంట నడిచిన కొందరు నేతలు బయటికి వచ్చి నేరుగా విమర్శలు చేస్తూ డీ..అంటే డీ  అంటున్నారు.వీరిది ఈ ప్రాంతంలో మొగోడి రాజకీయం అంటారు..వీరు కాకుండా అటు శిల్పా వెంట ఇటు ఫరూఖ్ వెంట తిరుగుతూనే వీరి రహస్యాలను ప్రత్యర్ధులకు,అంతర్గత శత్రువులకు చేరవేయడం అటు ఫరూఖ్ గాని ఇటు శిల్పాగాని జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ కోవర్టులు వారి వెంటనే తిరుగుతూ వారిని పొగుడుతూ మొహంచాటేస్తేనే వీరి శత్రువులకు రహస్య ఉప్పు అందిస్తున్నారు.చివరికి వారికి టికెట్టు రాకుండా అటు వైకాపాలో, ఇటు తెలుగుదేశంలో చేస్తున్న నాయకులకు అంతర్గత శత్రువులు వారి దగ్గరినుండి ప్రక్కకు వచ్చి పోనుచేయడం కాని సెల్ లోలైవ్ ద్వారాగాని మరో పద్దతిలోనే రికార్డు చేసి వినిపిస్తున్నారంటే ఎంతప్రమాదమోవారికి తెలుస్తుంది..వారినిపొమ్మంటే ఒకటి, రమ్మంటే మరొకటి అన్న విధంగా తయారయింది..కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారే తప్ప అంతర్గత శత్రువల వలన వచ్చిన లాభంకంటే నష్టం తొంభై శాతం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..ఒకవైపు తెలుగుదేశంలోనే ఉంటూ పరూఖ్ తో అంటీ అంటని భూమా బ్రహ్మానందరెడ్డి వల్ల వచ్చే నష్టం పరూఖ్ కు ఏమీ లేదు.అలాగే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డితో తీవ్ర స్థాయిలో విభేదించినా న్యాయవాది తులసిరెడ్డి, గోకుల కృష్ణారెడ్డి తదితరులు డూ ఆర్ డై రాజకీయంచేస్తూ నేరుగా శిల్పాకుటుంబంపై విమర్శలు చేయడంను శిల్పా ఒకరకంగా తీసుకుంటే వెంట తిరిగేవారు కాకుండా పదవుల ఇచ్చి ఉన్నతులను చేసిన వారు తవ్వుతున్న గోతులు మరింత ప్రమాదంగా మారాయని వీరిద్దరి ఆలోచన.ఈ ల్యాండ్ మైన్స్ ను ఎలా రిమూవ్ చేస్తారో వేచిచూడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *