జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
#యుద్ధానికి వెళ్తున్న నంద్యాల జిల్లా తహసీల్దార్లు
#బాలకృష్ణ కోటకు వెళ్తున్న శివప్రసాద్ రెడ్డి
#అనంతపురంకు శివరామ్ రెడ్డి – కదిరి రామ్‌నాథ్ రెడ్డి
#యుద్ధానికి సంసిద్ధమంటున్న శ్రీనివాసులు, మల్లికార్జునలు
నంద్యాల జిల్లాలో తహసీలార్లుగా పని చేస్తున్న ముగ్గురు వచ్చే ఎన్నికల్లో జరిగే యుద్ధమును పరిశీలించి పోలింగ్‌ను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు తహసీల్దార్ శివ ప్రసాద్ రెడ్డి హిందుపూర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా నియమకం అయ్యారు. ఈ నియోజకవర్గంలో సీనినటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం ముగిస్తుండడంతో రాష్ట్రంలోని అన్ని పాంత్రాలలోని ఓటర్లు, నాయకులు దృష్టి సారించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తూ వస్తున్నది. ఇలాంటి నియోజకవర్గంలో విజయం సాధించి తీరాలని వైయస్ఆర్‌సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రత్యేక పరిశీలకునిగా నియమిచడంతో మరింత సిరియస్‌గా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటువంటి నియోజకవర్గంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించడం కత్తి మీద సాము అవుతుంది. అయితే ఎన్నికల నిబంధనలు అమలు చేస్తూ విధులు నిర్వహిస్తాము అని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇదే స్థాయిలో గతంలో నంద్యాల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శివరాంరెడ్డిని అనంతపురం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా నియమించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్ ఓ ఉంటారు..వారి సహాయకులుగా అర్బన్ తహసిల్దార్లు వ్యవహరిస్తుంటారు..రాష్ట్రంలో అత్యంత చైతన్యవంతమైన, ఉద్యమాలను నిర్వహించే గడ్డ అయిన అనంతపురంలో విధులు నిర్వహించడం ఆషామాషి కాదు. అయితే 2014 చంద్రగిరి, 2019 కడప ఎన్నికలు నిర్వహించిన అనుభవంతో అతి చాకచక్యం శివరాంరెడ్డి విధులు నిర్వహిస్తారని స్థానిక రెవెన్యూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాలు డిటి విధులు నిర్వహించి ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని ఓడి చెరువు తహసీల్దార్‌గా పనిచేస్తున్న రామ్‌నాథ్ రెడ్డిని కదిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అక్కడ కుడా ఎన్నికల యుద్ధం జరుగుతుంది. అయితే తీవ్ర అనారోగ్యంగా ఉన్న రామ్‌నాథ్ రెడ్డి ఉన్నత అధికారులను సంప్రదించి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హోదా నుంచి విముక్తి కల్పించాలని కోరే అవకాశం ఉంది. వీరితో పాటు నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులును కడప జిల్లా ముద్దూరుకు, సంజాముల తహసీల్దార్ మల్లికార్జునను నగరికి, శిరివెళ్ల తహసీల్దార్ షేక్ మొహిద్దీన్‌ను పిలేరు అసెంబ్లీలోని తొట్టిచర్లకు బదిలీ చేశారు. వీరు కుడా ఎన్నికల్లో కీలక భూమిక పోషించాల్సి వస్తుంది. ఈ సారి గతంలో కంటే అధికంగా పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల సంఘానికి చేసే ఫిర్యాదును చాకచక్యంగా పరిష్కరించి నేతల మన్నలను పొందుతారో లేకా ఆగ్రహానికి గురి అవుతారో వేచి చూడాల్సిందే.