ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరిన్ని రోజులు పర్యటనలు చేసి, ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ ను విడుదల చేస్తామని ప్రకటించింది