అమరావతి జనవరి 06(జనాస్త్ర0)
జర్నలిస్ట్ ల హౌజ్ సైట్ కు సంభందించిన స్థల సేకరణ వెంటనే పూర్తి చెయ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా వున్న తహశీల్దార్ లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి..ఈ నెల 6వరకు సమాచార శాఖ ఆద్వర్యంలో ఆన్లైన్ ద్వారా అర్హులైన జర్నలిస్టులు ఇంటి స్థలం కోసం దరకాస్తులను ప్రభుత్వం స్వీకరించిన విషయం విదితమే..రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరకాస్తుల అర్హతను రెవెన్యూ హౌసింగ్ శాఖ డాటా తో సరి పోల్చి పూర్తి అర్హత వున్న జర్నలిస్టులు జాబితాను వడపోసి ఫైనల్ జాబితా వేగవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సన్నద్ధమయ్యారు.ఫైనల్ జాబితా ప్రకారం స్తల సేకరన జరిపి జరిపి జర్నలిస్ట్ వాటా మొత్తం చెల్లించే ఏర్పాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టింది..జనవరి ఆఖరికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది..