నంద్యాల జనవరి 06( జనాస్త్రం);
మారంరెడ్డి జనార్థన్ రెడ్డి
నంద్యాల జిల్లాలోని అక్రిడేషన్ జర్నలిస్టు లకు ఉమ్మడి జిల్లాలో పర్యటించడానికి వీలుగా ఆర్ టి సి బస్సు పాసులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి మల్లికార్జునయ్య శనివారం విలేకరులకు తెలిపారు..నంద్యాల ఆర్ టి సి లో పాస్ తీసుకుంటే నంద్యాల జిల్లాకు మాత్రమే పరిమితం అని అపోహ వుందని అన్నారు. గతంలో మాదిరి ఇప్పుడుకుడా వుమ్మడి జిల్లాలోని అన్ని ఆర్ టి సి బస్సులలో జర్నలిస్టులు ప్రయాణం ఉచితంగానే చేయవచ్చని ఆయన తెలిపారు.బస్సు పాసులుకూడా గతంలో మాదిరిగా కర్నూలు వెళ్ల వలసిన అవసరం లేదని దరఖాస్తు పూర్తిచేసి నంద్యాల క్రాంతినగర్ లోని ఆర్ ఎం కార్యాలయంలో సమర్పించి తగిన రశీదు తీసుకుని నంద్యాల ఆర్ టిసి బస్టాండు ప్రాంగణంలో పాసులు మంజూరు కేంద్రంలో తగిన రుసుం చెల్లించి జర్నలిస్టులు పాస్ లు తీసుకోవచ్చని డిపి ఆర్ ఓ మల్లి ఖార్జునయ్య తెలిపారు