జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
శ్రీ శైలం ఆలయం ట్రస్టు బోర్డు లో చోటు దక్కించుకున్న సింధు శ్రీ కి ఈ పదవి రావడం లో ఎన్నో అంశాలు కలిసి వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు…
సింధు శ్రీ నంద్యాల పట్టణం లోనీ ప్రముఖ డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి ..ఈమె కూడా డాక్టర్…
*ఈమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామాజిక వర్గం కు చెందినవారు అని అంటున్నారు
*ఈమె భర్త జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాలో పేరు మోసిన ఎముకల డాక్టర్…రోజా50 మంది రోగులకు ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు…
*ఈమె భర్త తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి ప్రముఖ ఇరిగేషన్ ఇంజినీర్..వైసీపీ హయం లో వేదింపులకు గురైనట్టు సమాచారం..రెండేళ్లపాటు ప్రధాన పోస్ట్ లకు దూరంగా ఉంచారు… ఇదే ప్రధానంగా కలిసి వచ్చినట్టు తెలుస్తుంది..
*ఈమె భర్త జగన్ మోహన్ రెడ్డి సొంత ఊరు మంత్రి బీసీ జనార్ధన రెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం లోనీ సంజామల మండలం లోని ముక్క మల్ల గ్రామం..వీరి బంధువులు బీసీ జనార్ధన రెడ్డి వర్గం లో ఉంటారు..
*ఆస్పత్రిని నంద్యాల పట్టణం లో ఓపెనింగ్ చేసి నప్పుడు మంత్రి బీసీ జనార్ధన రెడ్డి,mla బుడ్డా రాజశేఖరరెడ్డి,మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ తో పాటు టీడీపీ నేతలు ను ఆహ్వానించారు…వైసీపీ నేతలు కు ఆహ్వానం ఇవ్వలేదు…
*వైసీపీ అధికారం లో ఉన్నంత కాలం వారి వెంట తిరగడం కానీ , ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొన లేదని చంద్ర శేఖర్ రెడ్డి అంటున్నారు…
* సిందుశ్రీ తండ్రి డి ఎస్ పి రమణమూర్తి కూడా వైసిపి ప్రభుత్వ హయంలో వేదింపులతోొ దూరంగా ఉంచారు…ఈ అంశంకూడా సిందుశ్రీకి కలిసి వచ్చిన అంశమే
*మొత్తం మీద కొన్ని గంటలలో ట్రస్టు బోర్డు పేర్లు ప్రకటించే ముందు రాస్తే ప్రధాన కార్యాలయం నుండి ఫోన్ రావడం అందులో బీసీ _b వర్గానికి చెందిన మహిళ కావలిసి రావడం తో సింధు శ్రీ కి కలిసి వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు
*చివరిగా మంత్రి బీసీ జనార్ధన రెడ్డిని, చంద్ర శేఖర్ రెడ్డి,సింధు శ్రీ , జగన్ మోహన్ రెడ్డి పదవి వచ్చిన తర్వాత మర్యాద పూర్వకంగా వెళ్లినప్పుడు ఆప్యాయంగా పలుకరించడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు…