జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నంద్యాల డి ఎస్ పి యుగందర్ బాబుకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది…1991 ఎస్ ఐ బ్యాచ్ కి చెందిన ఈయన మొదటగా ప్యాపిలిలో ఎస్ ఐగా పనిచేశారు..2005 లో సిఐగా,2014 లో డిఎస్పి గా పదోన్నతి పొందారు..సిఐడి డిఎస్ పి గా కర్నూలు పలమనేరు,కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ భీమవరం సిసియస్ డి ఎస్పీగా ఆయన పనిచేశారు..ఇటీవల జరిగిన సాదారణ బదిలీలలో నంద్యాలకు డిఎస్పిగా వచ్చారు..ప్రస్తుతం పదోన్నతి పొందిన ఈయనను నంద్యాల ఎ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది…కాగా ఎఎస్పిగా పదోన్నతి పొందిన యుగందర్ బాబు శనివారం నంద్యాలలో బాద్యతలు స్వీకరించారు..ఈ సందర్బంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద అడిషనల్ ఎస్ పి కి ఎ ఆర్ సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు..