♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నీవు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరంలేదు….నీకు టికెట్టు రాలేదని బెంగ పడవద్దు .నీ భవిష్యత్తు ష్యూరిటీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటారు అందువల్ల మరో చర్చలకు అవసరం లేకుండా నీవు ఎన్నికల కదనరంగంలోకి దూకు..అని తెలుగుదేశం పార్టీ మహిళానాయకురాలు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నంద్యాల మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మనందరెడ్డికి ప్రత్యేక హామీ ఇచ్చారు..నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వచ్చిన నారా భువనేశ్వరి పలు టిడిపి కార్యక్రమాలలో పాల్గొన్నారు..అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డితోను,అనుచరులతోను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..స్థానికంగా ప్రచారం వెళ్లడానికి నీకున్న అభ్యంతరాలు, అనుమానాలు పార్టీ దృష్టిలో సీరియస్ గా ఉన్నాయని ఒకరిగురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదని నంద్యాలపార్లమెంటుకు పోటీచేస్తున్న శబరిని నంద్యాల అసెంబ్లీకి పోటీచేస్తున్న పరూఖ్ ను గెలిపించే భాద్యతలు తీసుకోవాలని కోరారు..ఇప్పటికే నీతో ప్రత్యేకంగాను, అబ్యర్తి పరూఖ్ తో కలిసి తనయుడు లోకేష్ భర్త చంద్రబాబు,పార్టీ నాయకులు చర్చలు జరిపిన విషయాన్ని భూమాకు గుర్తుచేశారు..పరూఖ్ తో కూడా అసంతృప్తులకు అవకాశం లేకుండా అందరిని కలుపుకుని పోయే భాద్యత అభ్యర్ధికి ఉందని అన్నారు..అనంతరం పరూఖ్ తన అనుచరులను ,,భూమాకూడా తన అనుచరులను భువనేశ్వరికి పరిచయం చేశారు..ఆత్మవిశ్వాసం అదికంగా ఉంచుకోకుండా ప్రతి ఓటును తెలుగుదేశంపార్టీ తరుపున పోటీచేస్తున్న ఇరువురికి ఓటు వేయించాలని గతంలోలాగ కాకుండా ఇప్పుడు కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని వారికి వివరించారు..