♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
పదేళ్ల విశ్రాంతి తరువాత యాళ్లూరు లక్ష్మికాంతరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనిపించబోతున్నారు..2014లో వైయస్ ఆర్ సిపి తరుపున నంద్యాల అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ప్రచారంలో కీలక భూమిక పోషించిన కాంతారెడ్డి ఆ తరువాత రాజకీయంగా నంద్యాలలో అదృశ్యం అయి బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు..అయితే 2024లో తిరిగి వైయస్ ఆర్ సిపి తరుపున ప్రచారంలోకి దిగే యోచనలో ఉన్నారు..వారంరోజుల క్రితం నంద్యాలకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి తో కలిశారు..వాస్తవంగా జగన్ మోహనరెడ్డికి నేరుగా పరిచయం ఉన్న యాళ్లూరు కాంతారెడ్డి ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణలతో కొంత దూరంగా ఉన్నారు..ఇప్పుడు తిరిగి యాక్టివ్ కావాలని శిల్పా విజయానికి కృషిచేయాలని భావిస్తున్నారు..ఆర్ కె ల్యాబ్ సమీపంలో సొంత కార్యాలయాన్ని ఆరంబించడానికి శిల్పాను ఆహ్వానించి తనకున్న తెరను తొలగించుకునే యత్నంలో ఉన్నారు..కాంతునికి ఉన్న పరిచయాలను సద్వినియోగం చేసుకోవడానికి అటు స్వంత ఊరు అయిన యాళ్లూరులోను,నంద్యాల పట్టణంలోను ఉపయోగించుకునే దిశగా శిల్పా పావులు కదిపే పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం..