!!గండా….కావాలి ..మాకు అండ !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

 

భారీ ఎత్తున స్నేహితులు, శ్రేయోభిలాషులు కలిగి ఉన్న నంద్యాల పట్టణంలోని యస్ బి ఐ కాలనీ నాయకుడు గండా వెంకటసుబ్బారెడ్డిపై ఒక ప్రదాన రాజకీయ పార్టీ గాలం విసిరినట్లు సమాచారం..ఉయ్యాలవాడ మండల ఉపాద్యక్షుడుగా గతంలో పనిచేసిన గండా వెంకటసుబ్బారెడ్డి పాతిక సంవత్సరాల క్రితం తనకు ఉన్న ప్యాక్షన్ వదులుకుని కొండుపల్లి నుండి నంద్యాల చేరుకున్నారు..అప్పటినుండి భూమా నాగిరెడ్డికి,ఎవి సుబ్బారెడ్డికి హార్డుకోరుగా వ్యవహరిస్తూ వస్తున్న గండాపై ఒక రాజకీయపార్టీ ప్రదాన నాయకులు మంతనాలు జరిపే యోచనలో ఉన్నారు..2009 లో ప్రజారాజ్యం తరుపున అసెంబ్లీకి పోటిచేసిన ఎవి సుబ్బారెడ్డికి, ఎంపిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డికి ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేశారు..ఆ తరువాత 2014లో వైయస్ ఆర్ సిపి అభ్యర్ధిగా పోటీచేసిన భూమానాగిరెడ్డికి కూడా ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేశారు..ఎవిసుబ్బారెడ్డి స్నేహితుడిగా ఇప్పటికి గండా కొనసాగుతున్నారు..అయితే భూమా నాగిరెడ్డి నంద్యాలరాజకీయం చేసే సమయంలో గండా కు అత్యదిక పరిచయాలు ఉన్న యస్ బి ఐ కాలనీ గాని ఎన్జిఓ కాలనీ గాని కౌన్సిలర్లగా పోటీచేయించే యత్నం భూమానాగిరెడ్డి చేశారు.గండా ను బరిలోకి దించే భాద్యతను ఆయనకు అత్యంత సన్నిహితుడైన న్యాయవాది గోపిరెడ్డి గోపినాదరెడ్డికి కూడా భూమా భాద్యతలు అప్పగించారు…అయితే సున్నితంగా తప్పుకుని తమ వర్గంలోని ఇతర నాయకులకు అవకాశం కల్పించారు..మొత్తం మీద నంద్యాలపట్టణంలో అత్యదిక సంఖ్యలో స్నేహితులు శ్రేయోభిలాషులు కలిగిన గండాను తమ వైపు తిప్పుకుంటే అత్యదిక ప్రయోజనం ఉంటుందనే అంశంపై రాజకీయపార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు..ఎవరిని గండాపై ప్రయోగిస్తే తమకు అనుకూలం అవుతారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు..కర్నూలు జిల్లా జడ్ పి చైర్మన్ ను పాపిరెడ్డిని గాని స్థానికంగా ఉన్న తమ శిబిరంలోని నాయకులను గాని రెండు మూడురోజులలో గండా ఇంటికి రాయబారం పంపే అవకాశం ఉందని ఆపార్టీలోని కీలకమైన వ్యక్తులు జనాస్త్రంతో తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *