♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
శివరాత్రి పండుగ వచ్చిందటే చాలు నంద్యాలపట్టణంలోని ఎన్ హెచ్ శంకరరెడ్డి వంద బస్తాల బియ్యాన్ని ఉచిత అన్న దాన కార్యక్రమాలకు అందిస్తుంటారు..గత పదిహేను సంవత్సరాలనుండి ఓంకారం,మహానంది క్షేత్రాలకు బియ్యాన్ని అందిస్తారు..ప్రతియేడాది ఓంకారానికి 101 బస్తాలు, మహానందికి 30 బస్తాలు,మహానంది రెడ్డి సంఘం అన్నదానానికి 30 బస్తాలు, షిర్డీ క్షేత్రానికి 5బస్తాలు, ఎన్జిఓకాలనీలోని రామాలయంకు శ్రీరామనవమి రోజున అన్నదానంకు 10 క్వింటాళ్ల బియ్యాన్ని ఉచితంగా అందచేస్తున్నారు..అనాధలు చదువుకునే సంఘమిత్ర విద్యార్ధులకోసం 25నుంచి 35 బస్తాల బియ్యం గత పది సంవత్సరాలనుండి కూడా అందచేస్తున్నారు…వీరు కాకుండా ఆలయాలలో ఇతర సంఘాలు అన్నదానంచేస్తే వారికి బీదలు పెళ్లిళ్లు చేసుకుంటే వారికి కూడా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు..భగవంతుని దయవల్లే తాను ఎన్నో కష్టాలనుంచి ఈ రైతు స్థాయికి ఎధిగానని అన్నారు…కొనఊపిరి ఉన్నంతవరకు ఉచిత ఖరీదైౌన బియ్యం వీలైనంత వరకు అందిస్తానని హామీ ఇచ్చారు..