♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నేటినుంచి దక్షిణ భారతం దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహానంది క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు(06.03.2024 నుంచి11.03.2024) ఆరంభం అవుతాయని లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా అద్భుతమైన ఏర్పాట్లను చేశామని మహానంది క్షేత్రం కార్యనిర్వహణాధికారి కాపు చంద్రశేఖరరెడ్డి మంగళవారం జనాస్త్రంకు తెలిపారు.గతంలో భక్తులు ఎదుర్కున్న సమస్యలను ఈసారి ఎదుర్కోకుండా చేశామని తెలిపారు..దేవాలయానికి అతి దగ్గరలో పార్కింగును ఏర్పాటుచేశామని దీంతోభక్తులు పెద్దగా సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం ఉండదన్నారు..పది ఎకరాలలో పార్కింగ్ వసతిని కల్పించామన్నారు..వాహనపాసులను తొలగించామని అన్నారు..
ఏర్పాటుచేసిన వసతులివి
1.కోనేరు దగ్గర మహిళా భక్తులకు ప్రత్యేక స్నానపు గదులు
2.స్వామని వేగంగా దర్శించుకునేందుకు ఏడు క్యూలైన్లు
3.దర్శనాలలో ఉచితం, శీఘ్రం,అతి శీఘ్ర దర్శనాల ఏర్పాటుె
3.ప్రతి భక్తునికి వేసివి తాపం తట్టుకోవడానికి ఉచిత మజ్జిగి,తాగునీరు
4.చలువ పందిళ్ల ద్వారా భక్తులకు ఆలయ దర్శనం
5.1.20 లక్షల ప్రసాదలడ్లు అందుబాటులోకి
6.15 కుల సంఘాల ద్వారా భక్తులకు అన్నదానం
7.దేవస్థానం ఆద్వర్యంలో వెయ్యి మందికి ఉచిత అన్నదానం
8.అత్యవసర వైద్యంలో భాగంగా నాలుగు మెడికల్ క్యాంపులు
9.,108 ,104 వాహనాలు అందుబాటు
10.24 గంటలు ప్రభుత్వ వైద్యులు,సిబ్బంది వైద్యసేవలకు సిద్దం
11.పరిశుభ్రతకోసం 70 మంది శానిటేషన్ సిబ్బంది సిద్దం
12.లింగోద్బవం (8వతేది) వేడుకలను చూడటానికి తెల్లవారుఝామున 4గంటలనుండి ప్రత్యేక లైన్లలో అనుమతి
13.10 వతేది రదోత్సవం 60 వేలమంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు