జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
#ఆళ్లగడ్డ సూరి పై కాంగ్రెస్ గురి
#ముందుగా కాంగ్రెస్‌లో చేరు అ తరువాత నీకే టిక్కెట్
#ఆర్థిక సమస్యలు ఉన్నాయన్న సూరి
#కాంగ్రెస్‌లో చేరే అంశం పై తర్జబర్జనలు
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ న్యాయవాది పి.సూర్యనారాయణ రెడ్డిని (సూరి) కాంగ్రెస్ పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మూడు దశబ్దాల నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో న్యాయవాద వృతిని నిర్వహిస్తూ దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల శ్రేయోభిలాషులా కొన్నసాగుతూ కొంతమందిని న్యాయవాద వృతి ద్వారా చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, దొర్నిపాడు,ఊయలవాడ మండలలోని 90 శాతం గ్రామాల్లో బలమైన నాయకులతో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా భరిలోకి దించితే ఎలా ఉంటుందన్న విషయం పై షర్మిల ఆద్వర్యంలోని కమిటీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదే నియోజకవర్గంలోని మరి కొన్న పార్టీకు చెందిన నాయకులు కుడా కాంగ్రెస టిక్కెట్‌ను ఆశీస్తున్నారు. అయితే ఇప్పటికే సూరితో కొందరూ నాయకులు కాంగ్రెస్‌లో చెరితే తాము టిక్కెట్‌కు భరోసా ఇస్తామని హామి ఇచ్చినట్లు తెలుస్తొంది.
గ్రామ నేతగా అనుభవం
దివంగత నేత భూమా నాగిరెడ్డి ఆశీసులతో పదేళ్ల క్రితం సూరి సొంతగ్రామమైన రుద్రవరం మండలంలోని ముత్తలూరు గ్రామం సర్పంచ్‌గా తన సతీమని కృష్ణవేణిని గెలిపించుకొని గ్రామంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. బ్యాంక్‌లతో సంప్రదించి రైతులకు రుణాలను ఇప్పించి పెద్ద ఎత్తున సహాయం చేశారు. ఆళ్లగడ్డ న్యాయవాదుల బార్ అసోషియేషన్‌గా ఆరు సార్లు గెలుపొందారు. లలితకళల కళ సమితి రోటరి క్లబ్‌లలో కీలక భూమిక సూర్యనారాయణ రెడ్డి అసెంబ్లీ స్థాయి బాధ్యతలు నిర్వహించడం పెద్ద సమస్య కాదని ఆయన శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.
సినిమా యత్నం విరమించుకుంటారా ?
ఒక లో బడ్జెట్ సినిమాను తీసే యత్నంలో సూరి ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే తనకు పరిచయం ఉన్న సీని రచయితలను మంచి స్టోరిని తయారు చేయాలని ఆ స్టోరికి సీని నటులు ఏవరైతే సరిపోతారనే విషయంతో ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందని సీని ప్రముఖులతో చర్చించినట్లు సమాచారం. సినిమా తీసే ఆలోచన వచ్చిన తరువాత తిరుమలకు వెళ్లి పూజలు కుడా చేసినట్లు తెలిసింది. 2024లో సినిమాను తీసి ఇదే ఏడాది డిసెంబర్‌లో రిలిజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు సుమంత్ రెడ్డి కాంగో దేశంలో భారీ ఎత్తున వ్యాపారం పెట్టడంతో సినిమా నిర్మాణంలో జాప్యం జరిగినట్లు సమాచారం. తనను కలిసిన కాంగ్రెస్ నాయకులకు ఆర్థికంగా సమస్య అవుతుందని సినిమా, వ్యాపారం పై దృష్టి పెట్టానని వివరించినట్లు సమాచారం. నంద్యాల పట్టణంలో ఒక విద్యా సంస్థల అధినేతను, తాను ప్రేమించే ఒక రాజకీయ పార్టీ నాయకుడిని సంప్రదించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తానని తాను, తనను కలిసి నేతలతో సూర్యనారాయణ రెడ్డి చెప్పినట్లు సమాచారం.