!! మున్సిపల్ కమీషనరు ఉత్తర్వులు హెకోర్టు సస్పెండ్  !!

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* 2313/1C స్థలము పై

* స్టేట్ బ్యాంక్ కాలనీ స్థల వివాదంపై

నంద్యాల పురపాలక సంఘం పరిదిలోని స్టేట్ బ్యాంక్ కాలనీలోని ఎరియా సర్వే నెంబర్ : 2313/1C లో ఎ. 0-29 సెంట్ల ఇండ్ల స్థలంపై మున్సిపల్ కమీషనర్  విధించిన ఆంక్షలను రాష్ట్ర హైకోర్డు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. స్థల యజమాని మూర్తిరెడ్డి యుగంధర్ రెడ్డి సోమవారము జనా స్త్రంకు వివరించారు. జనా స్త్రం తోపాటు మరికొన్ని వార్త సంస్థలలో ఇది ప్రభుత్వ భూమి అని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజము లేదని అన్నారు.. తనకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరి కొంతమంది స్థల యజమానుల తో కలసి ఎ.పి హైకోర్టును ఆశ్రయించి (W.P. No. 5465/2024) కేసుగా వేసినట్లు యుగంధర్ రెడ్డి తెలిపారు. 16-02-2022 న నంద్యాల మున్సిపల్ కమీషనర్  హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మా దస్తావేజులను రద్దు చేసి మాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు , రిజిష్టర్ ఆఫీసుకు  ఫిర్యాదు చేశారన్నారు. ఆ ఫిర్యాదు పై తాము హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర హైకోర్టు విచారించి కమీషనర్ ఇచ్చిన 16-02-2022 లెటర్ ను రద్దు చేశారు. కోర్టు  ఉత్తర్వుల ప్రకారము నంద్యాల మున్సిపల్ కమీషనర్  కి గానీ మరే ఇతరులకు గానీ మా భూమిపై ఎటువంటి చర్యలు తీసుకునే హక్కులు లేవని ఉత్తర్వులు జారీ చేసినట్లు యుగందర్ రెడ్డి తెలిపారు.. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబందము లేదు.

స్టేట్ బ్యాంక్ కాలనీలోని సర్వే నెంబర్ : 2313/1C, ఎ.2-60 సెంట్టు భూమి మాదేనని మరొకరిది కాదని  యుగంధర్ రెడ్డి, రామ ప్రతాప్ రెడ్డి, విజయ భారతి, సరోజమ్మ, అక్బర్ హుసేన్, దర్గా షేక్ అబ్దుల్లా, సయ్యద్ బాష, అహమ్మదర్ హుసేన్ తదితరులు తెలిపారు. అనవసరముగా రాజకీయ నాయకులకు చుట్టి తమను మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారని ఇంతకాలము న్యాయంకోసం ఎదురు చూశామన్నారు. ఇప్పటికైనా తమ స్థలముపై దుష్ట్రచారం  ఆపాలని వారుకోరారు. త్వరలో నంద్యాల పట్టణంలో విలేకర్ల సమావేశము ఏర్పాటు చేసి అన్ని విషయాలు చెబుతామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *