♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔నాలుగో విజయం కోసం మోహన్ రెడ్డి వ్యూహాలు
⇔అసంతృప్తుల పై గురి
⇔వ్యతిరేక ఓట్లను తగ్గించే యత్నంలో
⇔అంతా తనై నడిపిస్తున్న మోహన్ రెడ్డి
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ అనుభవమును తన కుమారుడైన శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని రెండవ దఫా భారీ మెజార్టీతో గెలిపించే వ్యూహాలకు శ్రీకారం చుట్టారు.
-గత కొద్ది మాసాల నుంచి నంద్యాలలో మకాం వేసిన మోహన్ రెడ్డి ముందుగా తమ పార్టీపై అసంతృప్తితో కొనసాగుతున్న నాయకులను ఓదర్చుతూ వారిలో జోష్ నింపే యత్నం చేస్తున్నారు.
-ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులను తమ వైపు తిపుకునే యత్నంలో కుడా నిమగ్నం అయ్యారు. వీరిలో కొందరు స్థానికంగా కలువడానికి ఇష్టం లేకపోవడంతో వారికి రాకపోకల వసతిని కల్పించి హైదారాబాద్‌లో చర్చలు జరుపుతున్నారు.
-పోలింగ్‌లో కీలక పాత్ర పొషించే ఉద్యోగులను సైతం తమకు సహాకరించాలని కోరుతున్నారు. మీకు ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటే ఈ సారి ఆ సమస్యను పరిష్కరించడానికి తన కుమారుడు రవి సంబంధిత ముఖ్య నేతలతో చర్చిస్తారని వివరిస్తున్నారు. దాదాపు అత్యధిక వార్డులలో, గ్రామాల్లో టిడిపి టిక్కెట్ రాని నాయకుడి అనుచరులకు గాలం విసురుతున్నారు.
-ప్రత్యర్థులు తమ పై అవీనితి ఆరోపణలు ,పదవులో అన్యాయం చేశారనే విమర్శలను మనస్సులో తీసుకొని వారికి సర్ది చేప్పి వచ్చేసారి మన ప్రభుత్వం తిరిగి వస్తుందని న్యాయం చేస్తానని హామి ఇస్తున్నారు. మొత్తం మీద 2004, 2009 ఎన్నికల్లో భారీ ఎత్తున్న మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్తిగా విజయం సాధించడం వెనుక శిల్పా కృషి ఎంతో ఉంది. ఆ తరువాత 2014, 2017 జరిగిన ఎన్నొకల్లో ఓటమి చవిచూసిన శిల్పా 2019లో కుమారుడు రవి చంద్రకిషోర్ రెడ్డిని రంగంలోకి దించారు. 2024లో కుడా నా బిడ్డ పోటీ చేస్తున్నారని ఆయనను మీ బిడ్డగా స్వీకరించి నాలుగవ సారి నా కుటుంబాన్ని ఆధరించాలని పదే పదే కోరుతూ సెంటిమెంట్ పండించే యత్నంలో ఉన్నారు.
-నాలుగు దఫాలుగా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో జరిగిన లభనష్టాలను దృష్టిలో పెట్టుకొని శిల్పా రవి విజయం కోసం వ్యూహాలను రచిస్తున్నారు. ప్రత్యర్థి ఎన్ఎండి ఫరూక్‌ను తక్కువ అంచన వేయకుండా బలమైన అభ్యర్థిగానే భావిస్తూ ఆయన బలమును స్టడి చేసి పావులు కదుపుతున్నారు. టిడిపికి ముస్లీం, బలిజ ఓట్లు అనూకులంగా ఉన్నాయని ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకునే యత్నం కుడా అంతర్గతంగా సాగిస్తున్నారు.