♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ ఉక్కుపాదం మోపుతున్న ఎస్ పి, అడిషనల్ ఎస్ పిలు
⇒ గతంలో విచ్చలవిడిగా పేకాట
⇒ ఉక్కుపాదం దెబ్బతో పొరుగుజిల్లాలకు, రాష్ట్రాలకు
⇒ ఆడేవారు కాదు,.ప్రోత్సహించేవారిపై కూడా చర్యలే
పేకాట అంటే మూడినట్టేనని నంద్యాల జిల్లాలోని పోలీసు అదికారులు హెచ్చరిస్తున్నారు..ఈ వ్యసనంలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా ఎస్ పి అదిరాజ్ సింగ్ రాణా ,అడిషనల్ ఎస్ పి యుగందర్ తో పాటు ఇతర సబ్ డివిజన్ అదికారులు చెప్పకపోయినా రహస్యంగా సమాచారం తెప్పించుకుని ఉక్కుపాదం మోపుతున్నారు..అదికారపార్టీ నాయకులు అయినా మంత్రులు ఎన్ ఎండి పరూఖ్, బి.సి జనార్ధనరెడ్డిలు కూడా అధికారులకు పూర్తి స్వేచ్చ ఇచ్చి ప్రభుత్వం కు మచ్చ తెచ్చే ఏ యత్నాన్ని కూడా సహకరించవద్దని అంతర్గతంగా ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.. నంద్యాల జిల్లా పరిదిలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం,పాణ్యం,నంద్యాల నియోజకవర్గాలలో మారుమూల సైతంనుంచి కూడా పేకాటపై అదికారులకు సమాచారం అందుతున్నది..ముందుగా హెచ్చరించడం ఆ తరువాత మరొకరి సిపారసుతో సంబందం లేకుండా అదుపులోకి తీసుకోవడంతో గత రెండు మూడు వారాలనుంచి పేకాట ఆడే వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు సమాచారం..కేవలం ఆడే వారిపైనే కాకుండా వారిని ప్రోత్సహిస్తున్న వారిని ఆటగాళ్లకు, ప్రోత్సహించేవారికి మద్యవర్తులుగా వ్యవహరించేవారిపై కూడా ఐరన్ పుట్ మోపుతున్నారు..గత మూడు దశాబ్దాలనుంచి అదికార పార్టీ చోటా నేతలకు ఈ ఆట లక్షలలోను,కోట్లలోను ఆదాయం తెప్పించేది..దీనితో దీనిని మొబైల్ రూపంలోను ,ఒకే రహస్య ప్రాంతంలోను నిర్వహించేవారు..ఇద్దరు అధికారులు తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుండటంతో ఈ పిచ్చి ఉన్న వారు పొరుగు రాష్ట్రాలకు,పొరుగు జిల్లాలకు వెళుతున్నారు..మొత్తం మీద ఐరన్ పుట్ మోపుతున్న జిల్లా ఎస్ పి అదిరాజ్ సింగ్, అడిషనల్ ఎస్ పి యుగందర్ లతో పాటు క్రింది స్ధాయి అదికారులను సిబ్బందిని ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..