♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
⇒ హౌసింగు బోర్డు సమస్యను పరిష్కరించండి
⇒ ప్రజా పరిష్కార వేదికలో పిర్యాదుచేసిన ప్రయోజనంలేదు
⇒ ♦అక్రమాలపై రెడ్ మార్కును ఉంచండి..అన్నిటిపై కాదు
కలెక్టర్ అమ్మా …నీవు అనుకుంటే నాలుగైదు నిమిషాలలోనే హౌసింగు బోర్డు సమస్యను పరిష్కరిస్తావని నంద్యాలజిల్లా కేంద్రంలోని హౌసింగు బోర్డు ప్రజలు అంటున్నారు..ఏడాదినుండి హౌసింగు బోర్డులో క్రయవిక్రయాలను నిలిపివేయడంతో వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు..గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను తమకు మేలు చేకూర్చేవిదంగా రిజిష్టరు కార్యాలయంలో రెడ్ మార్కును తొలగించాలని కోరుతున్నారు..ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో పిర్యాదు చేస్తున్నా స్పందన రాకపోవడంతో హౌసింగు బోర్డు కౌన్సిలర్ దేశం సులోచనతోపాటు, ఎన్ హెచ్ శంకర రెడ్డి తదితరులు పిర్యాదు చేశారు..అయినా స్పందన లేదు…దీనితో శంకరరెడ్డి మాట్లాడుతూ అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న స్థలాలకు మాత్రమే రెడ్ మార్కును నిర్ణయించాలని వందలాది ఇళ్లకు రెడ్ మార్కును నిర్ణయిస్తే ఎలా అంటూ జనాస్త్రం కు వివరించారు..జిల్లా కలెక్టరు వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి రెడ్ మార్కును తొలగిస్తే వేలాది మందికి మేలు చేకూరుతుందని అన్నారు..