♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ నరహరి విశ్వం ఆద్వర్యంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు
⇒ రాష్ట్రంలోని ఎంపిలలో ఏడవ స్థానం
⇒ దూసుకెళుతున్న నంద్యాల ఎంపి
శబరమ్మా…నీవు వందేళ్లు నంద్యాల ఎంపిగానే జీవించాలంటూ ఆమె జన్మదినం సందర్బంగా జిల్లా తెలుగుదేశం నాయకుడు నరహరి విశ్వనాదరెడ్డి ఆద్వర్యంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకలలో పలువురు పేద ప్రజలు ఆమె ఇష్ట దైవాన్ని కోరుతూ సమావేశాలు నిర్వహించారు..జయహో శబరి మేడం..జై విశ్వనాదరెడ్డి అంటూ వేడుకలు నిర్వహించిన ప్రాంగాణాలు మారుమోగాయి..మొదటిసారిగా పార్లమెంటుకు ఎన్నికయిన శబరి ప్రజా సమస్యలను పార్లమెంటుకు తీసుకువెల్లడమే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్రమోడితో సహా కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి ఏడు అసెంబ్లీలలోని సమస్యలను వివరించారు..రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ప్రతి చర్చా వేదికల్లో పాల్గొంటూ రాష్ట్రంలోని ఎంపిలతో పోలిస్తే ఏడవ స్థానంలో నిలిచి ప్రజల ప్రశంసలు అందుకున్న డా బైరెడ్డి శబరికి భారీ ఎత్తున జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించడంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నరహరి విశ్వనాదరెడ్డి ప్రదమ స్థానంలో నిలిచారు..పేద ప్రజలకు మేలుచేకూరే విదంగా ఆమె జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించిన విశ్వనాదరెడ్డిని పలువురు ప్రశంసించారు..ప్రతి యేటా బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి శబరి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని ఎక్కడ చూసినా ఆమె వందేళ్ల ఎంపిగా కొనసాగాలని కోరారని నరహరి విశ్వనాదరెడ్డి విలేకరులకు తెలిపారు..