♠ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦ సీనియర్ కార్యకర్తలకు న్యాయంచేయాాల్సిందే
♦ఎంఎల్ఎలు సిపారసుచేయకున్న పార్టీనే గుర్తుచేస్తున్నది
♦ స్వంతవేగులతో నివేదికలు
తెలుగుదేశంపార్టీ అదికారంలోకి వచ్చి 150 రోెజులు కావడంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కావడిని మోస్తున్న కార్యకర్తలు,నాయకులకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నంలో పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు,లోకేష్ లు 175 నియోజకవర్గాలలో దృష్టిని సారించారు..గతంలోలా కాకుండా ఈసారి కేవలం పార్టీ కండువా కప్పుకుని కావడి మోసిన కార్యకర్తలకే పదవులు లభించాలని వారి త్యాగాలవల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభ, పార్లమెంటు సభ్యుల సమావేశాలలో పేర్కొంటున్నారు..వారికి ఏ లోటు రాకుండా చూడాల్సిన భాద్యత మీదేనని చెబుతున్నారు..ఇంతటితో వదిలిపెట్టకుండా పార్టీ వేగులతో ఆరా కూడా తీస్తున్నారు..ముందుగా డల్ అయిన నాయకులు ఎవరూ అనే ఆరా తీస్తున్నారు..గతంలో కొన్ని సమీకరణాల వల్ల సిసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఇప్పుడు అలా జరగడానికి వీలులేదని కూడా ఖరాఖండితంగా చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా నియమించిన నామినేటెడ్ పోస్టులలో కార్యకర్తలకే అదిక ప్రాదాన్యత ఇచ్చారు..ఇక త్వరలో నీటిసంఘాలు, మార్కెటు యార్డులు,కెడిసిసి,దేవాలయాల కమీటీలలో కూడా పార్టీకి ప్రాణంపోస్తున్న కార్యకర్తలకు స్థానం కల్పించాలని యోచిస్తున్నారు..ఇప్పటికే నివేదికలను తన దగ్గర ఉంచుకున్నారు..సిపారసు చేసే ఎంఎల్ఎలు వీరిపేరు చేర్చకుంటే పార్టీనే చేర్చి వారికి న్యాయంచేస్తున్నది..మొత్తంమీద ఒక వైపు కూటమిలో భాగస్తులైన బిజెపి,జనసేనలకు మేలుచేస్తూ మరోవైపు టిడిపిలో అసలైన కార్యకర్తలకు పట్టంకట్టే యోచనలో ఉన్న బాబును లోకేష్ ను క్యాడర్ అభినందనలతో ముంచెత్తుతున్నారు..