చరిత్ర సృష్టించడం లో విజయ డైరీ…

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్దనరెడ్డి


*గతం లో ఎన్నడు లేని విధంగా..
*రైతులు,ఉద్యగులు,కార్మిక ప్రయోజనాలు లక్ష్యంగా …
*2021_2025 లో అరుదైన రికార్డు
*రాబోయే రోజుల్లో మరెన్నో లాభాలు అందుతాయి…
*చైర్మెన్ SV జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యం లో ప్రణాళికలు

పోస్తే పాలు కర్నూలు విజయ డైరీ కే పొయ్యాలి…అన్న విధంగా పాడి రైతులలో ఆలోచన వస్తున్నదని విజయ డైరీ పాలక మండలి సభ్యులు అంటున్నారు…తమ డైరీ లో పాల రైతులు ,కార్మికులు , ఉద్యగులు ప్రయోజనాల కోసం డైరీ పాలక మండలి సభ్యులు పని చేస్తున్నారని డైరీ చైర్మన్ sv జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు..
*గతం లో ఎన్నడు లేని విధంగా పాడి రైతులు కు 4 ఏళ్ల లో రూ 17 కోట్లు ,ఉద్యోగులు, కార్మికులకు రూ 3.50 కోట్లు బోనస్ ఇచ్చారు..గేదెల కొనుగోలుకు 20 శాతం రాయితీ తో రూ 1.10 లక్షలు, పాడి రైతుల కు ఆసరాగా మరణించిన పాల రైతుల నివాళి కోసం రూ 15 లక్షలు చెల్లించడం జరింగింది అని ఇది 2021 లో మా పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన తరువాత చేపట్టామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు… ఇది అరుదైన రికార్డు సృష్టించి నట్టు విశ్లేషకుల సైతం తమతో అన్నారని ఐతే మేము ఇంతటి తో సంతోషం చెందడం లేదని మరికొన్ని పెద్ద ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మని అన్నారు…
*తాము బాధ్యతలు తీసుకోకముందు 2021 లో కేవలం 180 కోట్లు వార్షిక ఆదాయం మాత్రమే ఉండగా ఇప్పుడు రూ 310 కోట్లకు పెరిగిందన్నారు…గతం లో రూ 50 వేలు రోజుకు పాల సేకరణ కాగా ఇప్పుడు 1.30 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతున్నదని అలాగే మూలధన పెట్టుబడి లో రూ 1.40 కోట్లు నుంచి రూ 36కోట్లు కు చేరుకుందని అన్నారు…ఎవరు ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేసేదీ లేదని పాల రైతులు, కార్మికులు, ఉద్యగులు కు మేలు జరగడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మని sv జగన్ అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *