జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
* పూజల్లో పాల్గొనే వారికి నో టికెట్
* భక్తులకు సేవకులకు ఉచితంగా భోజనం అల్పాహారం
జగజ్జనని దేవాలయంలో ఉచితంగా సేవ చేసే వారికి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.అక్టోబర్ 3 వ తేదీ నుండి జగజ్జనని దేవాలయంలో దీక్షలు స్వీకరిస్తారని,40 రోజులపాటు భక్తులచే ఆలయం కిటకిటలాడుతుందని ఆ సమయంలో సేవకుల సేవ అవసరమన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు, సేవకులకు మూడు పూటలా అల్పాహారం భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. ఆలయంలో జరిగే ఏ పూజలోనైనా భక్తులు పాల్గొనవచ్చని,వారి నుండి టికెట్ వసూలు చేసే ప్రసక్తే లేదని,అందరు ఉచితంగా పూజల్లో పాల్గొంటారని, ఈ సంప్రదాయం ఆలయం పుట్టినప్పటి నుండి కొనసాగుతున్నదని పుల్లయ్య అన్నారు.భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి వస్తే సరిపోతుందని పుల్లయ్య అన్నారు