♦జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔గెలిచిన మూడు సార్లు ముప్పైవేలకు పైగానే
⇔శిల్పామోహనరెడ్డి ఇంటి దగ్గర నుండే
⇔కుటుంబసభ్యులు బహిరంగ ప్రచారంలో
నంద్యాల గడ్డపై శిల్పా కుటుంబం నాల్గవ విజయం సాధించడానికి మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి అస్త్రాలను సంధిస్తున్నారు. నంద్యాల పట్టణం గోస్పాడు నంద్యాల మండలాల్లో బలమైన నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్సిపి లో చేర్పించడంలో విజయం సాధిస్తున్నారు. ఒకవైపు ఓటర్ బలం కలిగిన వైఎస్ఆర్సిపి క్యాడర్లో రగులుతున్న అసంతృప్తిపై నీళ్లు చల్లుతూ వారిని దువ్వుతున్నారు .మరోవైపు ఇంతకాలం పార్టీకి దూరంగా ఉండి ఓటర్ బలం కలిగిన నాయకులను ఆహ్వానించి వారికి అవసరమైన భరోసా ఇస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి 90% సమయం ఇంటికి మాత్రమే పరిమితమై భారీ మెజార్టీ లభించే విధంగా తమ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మరోవైపు తనయుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, భార్య రమాదేవి కోడలు నాగిని రెడ్డి కుమార్తె శిల్పాతో పాటు బావమరిది జగదీశ్వర్ రెడ్డి తదితరులు వార్డు, గ్రామ ప్రచారాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లను చేశారు. అనవసరమైన మాటలు లేకుండా అత్యధిక మంది ఓటర్లను కలవడమే లక్ష్యంగా ఉండాలని వారికి శిల్పా మోహన్ రెడ్డి ఆదేశించారు .ఆయన ఆదేశం మేరకు పోలింగ్ దగ్గర పడే కొద్ది ప్రతి ఓటర్ను ఈ నలుగురిలో కనీసం ఒకరైన కలిసే విధంగా ప్రణాళికలను రూపొందించారు. రాత్రి గాని ఉదయం గాని ఒక అరగంట తండ్రి తనయులు చర్చించుకుని ముందుకు సాగుతున్నారు. టంగ్ స్లిప్పు కాకుండా సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. గతంలో మూడుసార్లు శిల్పా కుటుంబానికి నంద్యాలలో 30 వేలకు తక్కువ కాకుండా మెజార్టీ వచ్చిందని ఇదే మెజార్టీని తిరిగి రప్పించడానికి తమ అభిమానులు కార్యకర్తలు చూసుకోవాలని ప్రతిరోజు మోహన్ రెడ్డి వారికి నిర్దేశం చేస్తున్నారు.