♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔బైరెడ్డి, ఫరూక్ శిబిరంలో విశ్వం హాట్ టాపిక్…
నరహరి విశ్వం…బుడ్డా …చింతకుంట విశ్వం పేర్లు నంద్యాల ప్రాంతంలో తరుచూ వింటుంటారు..కొత్తగా ఏ తెలుగుదేశంపార్టీ కార్యాలయానికి వెళ్లినా అటు ఫరూఖ్ గాని, ఇటు బైరెడ్డి శబరి, రాజశేఖరరెడ్డిలు విశ్వాన్ని పిలువు అంటున్నారు..ఎవరు.. ఈ విశ్వం అని అందరూ తలలు బాదుకుంటున్నారు..ఇటీవల వైసిపి నుండి టిడిపిలోకి చేరిన విశ్వమేనని ఆయన మొహం చూసిన తరువాత చర్చించుకుంటున్నారు..అందుకే ఎన్నికలు ముగిసేవరకు బైరెడ్డి విశ్వం , పరూఖ్ విశ్వం అని పిలుస్తున్నారు..వివరాలలోకి వెళితే …
నంద్యాల టిడిపిలో నరహరి విశ్వనాథరెడ్డి విసురుతున్న అస్త్రాలు ఆ పార్టీ అభ్యర్థులు ఫరూక్ బైరెడ్డి శబరిలకు వరంగా మారాయి .నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీలో కొనసాగిన విశ్వం టిడిపి ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని ప్రకటించిన రోజునే విశ్వం వైఎస్ఆర్సిపి ని వదిలి టిడిపిలో జర్నీని ఆరంభించారు .ఆ రోజు నుంచి ఈరోజు వరకు తన పాత రాజకీయ గురువు అయిన ఫరూక్, శబరి కి అవసరమైన రాజకీయ అస్త్రాలను అందిస్తుండడంతో ఒకరకంగా వారి బలం పెరిగిందని చర్చించుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్న నాయకులను గుర్తించి వారి ఇంటి దగ్గరికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తీసుకువెళ్లి చర్చించే ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి పదిమందిలో ఏడు మంది టిడిపితో నడవడానికి సిద్ధమయ్యారంటే వారి వెనక విశ్వం హస్తం ఉందని పార్టీలోని కొందరు నాయకులు జనాస్త్రంతో పేర్కొంటున్నారు .నంద్యాల అసెంబ్లీ పార్లమెంట్ పై పట్టు ఉండి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కొందరు విలేకరులను సైతం చర్చిస్తూ ప్రజల అవసరాలను నేతల దృష్టికి తెచ్చి ఓటర్లను తమ వైపు తిప్పేయత్నం చేస్తున్నారు .విశ్వం టిడిపిలోకి రావడానికి ఇష్టం లేని కొందరు నాయకులు అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులైన ఫరూక్ శబరిలకు ఫిర్యాదు చేసిన వారు విశ్వం కే ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే ఈయన సలహాలు సూచనలు ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతుంది.