♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇔రక్త సంబందీకుల కోసం మాజీ మంత్రుల ప్రచారం
⇔కర్నూలులో రెండు ఎంపిలకు వేరువేరుగా ఓట్లు
⇔బరిలో మాజీ సిఎం తనయుడు
⇔నంద్యాలలో ముగ్గురు టిడిపి మహిళా అభ్యర్థులు
⇔వైసిపి తరుపున కర్నూులులో ఇరువురు మహిళలు
⇔కర్నూలులో టిడిపి కి నంద్యాలలో వైసిపి కి మైనారిటీలు నిల్
కర్నూలు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరుపున ముగ్గురు మహిళలు,వైసిపి తరుపున ఇద్దరు మహిళలు ఎన్నకల బరిలో దిగారు..తెలుగుదేశం పార్టీ తరుపున ముగ్గురు మహిళలు నంద్యాల బరిలో ఉండగా కర్నూలు బరిలో అసెంబ్లీకి గాని పార్లమెంటుకు గాని ఒక్కమహిళ కూడా బరిలో లేరు..అలాగే వైయస్ఆర్ సి తరుపున నంద్యాల పార్లమెంటులో ఒక్కమహిళ కూడా పోటీచేయడం లేదు.కర్నూలు పార్లమెంటు పరిదిలోని ప్రస్తుత ఎంఎల్ఎ కంగాటి శ్రీదేవి (పత్తికొండ) మాజీ ఎంపి బుట్టా రేణుక,(ఎమ్మిగనూరు) వైసిపి అభ్యర్ధులుగా పోటీచేస్తున్నారు.నంద్యాలపార్లమెంటులో టిడిపి అసెంబ్లీ అభ్యర్ధులుగా మాజీ మంత్రి అఖిలప్రియ(ఆళ్లగడ్డ) గౌరుచరిత(పాణ్యం) బైరెడ్డి శబరి (నంద్యాల ఎంపి ) టిడిాపి అభ్యర్ధులుగా పోటీచేస్తున్నారు..
1.నంద్యాల నియోజకవర్గంలో వైసిపి తరుపున ఒక్క మైనారిటీ కూడా పార్లమెంటుకుగాని, అసెంబ్లీకిగాని పోటీచేయలేదు..టిడిపి తరుపున ఎన్ ఎండి పరూఖ్ (నంద్యాల), పోటీచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ తరుపున కర్నూులు పార్లమెంటులో ఒక్క మైనారిటీ కూడా పోటీచేయలేదు..వైసిపి తరుపున మాజీ ఐఎయస్ అదికారి ఇంతియాజ్ పోటీచేస్తున్నారు..
2.ఆరు సార్లు ఎంఎల్ఎగా గెలుపొందిన కాటసాని రాంభూల్ రెడ్డి ఏడవసారి పాణ్యం నియోజకవర్గంనుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు..
3.మాజీ ముఖ్యమంత్రుల తనయులలో ఒక్కరైన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గంనుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు..
4 వైసిపి తరుపున కాటసాని రామిరెడ్డి (బనగానపల్లె) కాటసాని రాంభూల్ రెడ్డి (పాణ్యం) సాయి ప్రసాదరెడ్డి (ఆదోని) బాలనాగిరెడ్డి( ఎమ్మిగనూరు) అన్నదమ్ములుగా బరిలోకి మరోసారి వైసిపి తరుపున దిగుతున్నారు.తెలుగుదేశం పార్టీ మాత్రం కోట్ల,భూమా, కెయి లాంటి కుటంబాలలో సైతం రెండు టిక్కెట్లు ఇవ్వడానికి పార్టీ నిరాకరించింది..
5.కర్నూలు పట్టణంలో ఓటర్లు రెండు పార్లమెంటులకు ఓట్లు వేయనున్నారు..నంద్యాల పార్లమెంటు తరుపున కర్నూలు పట్టణంలోిని 16 కార్పొరేటర్ల పరిదిలో ఓట్లు వేస్తుండగా మిగిలన కార్పొరేటర్లలలో కర్నూలు పార్లమెంటుకు ఓట్లు వేయడం ఇక్కడ చర్చించనీయాంశమైన అంశం..పార్లమెంటు ఓట్ల ఈవియంలను ఏ పార్లమెంటుకు ఆపార్లమెంటుకు వేయాల్సి ఉంటుంది.
6.డోన్ లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోసం భార్య మాజీ ఎంఎల్ఎ సుజాతమ్మ, నంద్యాలలో శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గెలుపు కోసం తండ్రి,మాజీ మంత్రి శిల్పామోహనరెడ్డి, ఆళ్లగడ్డలో గంగుల నాని విజయం కోసం ఆయన తండ్రి మాజీ ఎంఎల్ సి గంగుల ప్రభాకరరెడ్డిలు ,నంద్యాలపార్లమెంటు అభ్యర్ధి బైరెడ్డి శబరి తండ్రి మాజీ ఎంఎల్ఎ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ,కర్నూలు అసెంబ్లీలో టిజి భరత్ కు ఆయన తండ్రి మాజీ మంత్రి టిజి వెంకటేష్ ఉన్నత హోదాలు అనుభవించి కుటుంబసభ్యుల విజయాలకోసం ప్రచారం చేస్తున్నారు..