♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్డనరెడ్డి
⇔కాళహస్తి శివయ్య ….. నా సహాయం ఇదేనయ్య
⇔30 టన్నుల ఉచిత కూరగాయాలు
⇔16 ఏళ్ల నుంచి మిస్ కాకుండా కూరగాయాలు
⇔అహోబిలం, ఆర్.ఎస్.రంగాపురానికి కుడా
⇒మహానందికైతే నిత్య ఉచిత కూరగాయాలు
పంచభూతములు వాయువుకు (గాలి) అధిపతిగా, రాహు కేతు పూజలకు ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమానికి నంద్యాల పట్టణంలోని ప్రధాన కూరగాయాల వ్యాపారి టి.రామన్న కుటుంబం 30 టన్నుల కూరగాయాలను ఆదివారం ఉదయం నంద్యాల నుంచి శ్రీకాళహస్తికి పంపారు. ఈ కూరగాయాల విరాళాన్ని గత 16 సంవత్సరాలుగా ప్రసాద్, ఆదిలక్ష్మి దంపతులు కాళహస్తికి పంపుతున్నారు.
అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ మహానందిశ్వర స్వామి దేవస్థానము అయితే సాధారణ రోజుల్లో రోజుకు 200 మంది అన్నదానంకు అవసరమైనా కూరగాయాలను బ్రహోత్సవాల సమయంలో రోజుకు 1500 నుంచి 2000 మందికి ఉచితంగా కూరగాయాలను అందిస్తున్నారు. వైష్ణవ క్షేత్రాలైన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంనకు, ఆర్.ఎస్.రంగాపురంలోని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానంకు కుడా ఉచితంగా ముఖ్యమైన పర్వదినాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలను అందిస్తున్నారు. భారీ విలువ చేసే కూరగాయాలను ప్రతి ఏటా ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రసాద్ ఆదిలక్ష్మి, దిలీప్ దంపతులను పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆకలితో ఆలయ దర్శనలకు వచ్చే భక్తులకు నేను అందించే కూరగాయాలు నాకేంతో సంతోషం కలిగిస్తున్నాయని నాతో పాటు నా కుటుంబ సభ్యులు భవిష్యత్తులో చేసే వ్యాపారాల నుంచి కుడా ఈ ఉచిత కూరగాయాల పంపిణీ జరుగుతుందని అన్నారు.