జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
అమ్మవారికి ఏ వారం రాహుకాల పూజ చేస్తే…
* ఏడువారాల పూజలు ఉచితం
* అంతా ఉచితమే
* రాహుకాల పూజల సమయాలు ఇవే
జగజ్జనని ఆలయంలో జరుగుతున్న రాహుకాల పూజలకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఒక్కొక్క రోజు రాహుకాలం పూజ చేస్తే ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందని భక్తులు భావిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం
ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు రాహుకాల పూజ చేస్తే సంతాన ప్రాప్తి తో పాటు ఆరోగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు జరిగే పూజలో పాల్గొంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడమే కాకుండా గృహ నిర్మాణం చేపడతారని వివాహ సంబంధాలు అనుకూలిస్తాయని వారంటున్నారు.
మంగళవారం పూజ చేస్తే రుణ విమోచన,నరదిష్టి నివారణ జరుగుతుందని, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు పూజ జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు జరిగే పూజలో పాల్గొంటే వ్యవసాయానికి,వ్యాపారానికి,కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం.
గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు జరిగే పూజలో పాల్గొంటే రాజకీయ పదవియోగం,విద్యా ఉద్యోగాలకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం.
శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాల పూజ జరుగుతుందని ఇందులో పాల్గొంటే స్త్రీ సౌభాగ్యం,సిరిసంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం.
శనివారం ఉదయం 9 గంటలనుండి 10:30 వరకు జరిగే పూజల్లో పాల్గొంటే సకల శని పీడలు,వాస్తు దోషాలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం
రాహుకాల పూజల్లో పాల్గొనేవారు 9866727123 కి ఫోన్ చేయాలని నిర్వాహకులు పుల్లయ్య తెలిపారు