రెడ్లకు భైరెడ్డి టానిక్… రెడ్ల సభలో జోష్ నింపిన భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* రెడ్లకు భైరెడ్డి టానిక్.
* 5 లక్షల రెడ్లతో గర్జణ జరగాలి..
* నకిలీ సంఘాలను పట్టించుకొవద్దు…
* రెడ్ల సభలో జోష్ నింపిన భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి….
* గ్రామ కమిటీలు వాల్ రైటింగ్స్ జరగాలి

రాష్రంలో నిరాశ, నిస్తేజంలో ఉన్న రెడ్లకు మాజీ యం.ఎల్.ఎ రాయలసీమ హక్కుల పొరాట సమితి అద్యక్షలు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలు పరుగులు తీసే టానిక్ లాగా పనిచేస్తున్నాయి. ఆదివారం నంద్యాల పట్టణంలోని రాజా రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన అఖిల భారత రెడ్ల సమావేశంలో ఆయన ముఖ్య అథిదిగా పాల్లోన్నారు. రాయలసీమతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రెడ్లు ఈ సమావేశానికి హాజరుఅయ్యారు. ఈ సందర్బంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్తితులే రెడ్లలో ఉంటే ఉనికిని కోల్పోవడం కాయమని అందువల్ల ఐకమత్యంగా పొరాడితే తప్ప పూర్వవైభవం రాదన్నారు. ఏకులాన్ని, ఏమతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని రెడ్లు తమ సమస్యల కోసం పోరాడటం తప్పుకాదన్నారు. ఒక ప్రధాన రాజకీయపార్టీకి చెందిన వ్యక్తిఅయిన రెడ్ల గురించి ఎకపక్షముగా మాట్లాడి తన అభిమానాన్ని చాటుకున్నారని ఇటువంటి లీడర్ ఉంటే ఎంతవరకైన పొరాటం జరుపవచ్చని రెడ్లసంగం నేతలు అభిప్రాయపడ్డారు. మాటలతో పనిజరగవని సభలు, సమావేశాలు, ర్యాలీలతో హక్కుల కోసం పొరాటం జరుపవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాల సభతోనే భై చెప్పవద్దని ఇది ట్రైలర్ కూడా కాదని కేవలం పేర్లు మాత్రమే పడుతున్నాయని అసలు సినిమా ఆరంబమవుతుందని అప్పుడు రెడ్లు ఏమిటో తెలుస్తుందని భైరెడ్డి అన్నపుడు సమావేశంలో పెద్ద ఎత్తున అనుకూల నినాదాలు చేశారు అంతే కాక మరో ఐదు సదస్సులు రాష్ట్రంలోని 25 జిల్లాలో రెడ్లు కలిసే విదముగా సభలు సమావేశాలు జరపాలని సూచించారు. అంతే కాక గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని రెడ్లు అదికంగా నివసించే గ్రామాలలో రెడ్ల ఐక్యత వర్దిల్లాలి అంటూ పెద్ద బోర్డులు తయారు చేయాలని కొరారు. ఆరవ సభను నరసరావు పేట కానీ, మరో ప్రాంతానికి కానీ ఎంపిక చేసుకొని 5 లక్షల మందితో గర్జన జరపాలని వీటన్నిటికి తాను స్వయంగా హాజరు కావడమే కాకుండా సహకారం అందిస్తానని చెప్పారు. ఇలా చెప్పుతున్న సమయములో కశితో ఉన్న రెడ్లలో ఆనందం అదికమయి ధైర్యంగా రెడ్ల తరుపున మాట్లాడిన భైరెడ్డి జిందాబాద్ అంటూ టాఫ్ లేచిపోయే విదముగా కేకలు వేశారు. కొంతమంది రెడ్ల ఐఖ్యతను దెబ్బ తీసే విదముగా కేడీ, నకిలీ సంఘాలు వచ్చాయని వాటిని లెక్కచేయాల్సిన అవసరం లేదని పేర్కోన్నపుడు కూడా హర్షద్వానాలు మిన్నుముట్టాయి. మొత్తము మీద రెడ్ల సంఘం లో భైరెడ్డి వాఖ్యలు పెద్ద జ్యోస్ ను నింపాయని రెడ్ల సంఘంనాయకులు పేర్కోన్నారు. సమావేశంలో పాల్గోన్న అఖిల భారత రెడ్ల  ఐఖ్యవేదిక రాష్ట్ర కన్వినర్ పట్నం సురేంద్ర రెడ్డి రాష్ట్ర ఉపాద్యక్ష్యరాలు సానం సుహాసిని రెడ్డి, వేమా భరత్ రెడ్డి, అట్ల విశ్వనాత్ రెడ్డి, కృష్ణా రెడ్డి, గోపా రెడ్డి, జర్నలిస్టులు మారంరెడ్డి జనార్థన్ రెడ్డి, కాశీపురం ప్రభార్ రెడ్డి, రమణా రెడ్డి, రెడ్డి మాస పత్రిక ఇంచార్జి ప్రతాప్ రెడ్డి, బిర్రు ప్రతాప్ రెడ్డి, నేవరి హేమలతా రెడ్డి, నరహరి విశ్వనాథ్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *