♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔రాష్ట్రపండుగగా గుర్తించిన ఎపి సర్కారు.
⇒తెలంగాణా సర్కారుసైతం ముందుకు
భారతదేశంలోనే అతిపెద్ద వైష్ణవ క్షేత్రం అయిన అహోబిలం క్షేత్ర పీఠాదిపతి రంగనాద యతీంద్ర మహాదేశికన్ కు తిరుమలలో అసాధారణమైన గౌరవం దక్కింది..అహోబిళ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ముగించుకుని బయలుదేరుసమయంలో తిరుమలకు అహోబిళం పీఠాదిపతి వెళ్లే సంప్రదాయం ఉంది..ఈసంప్రదాయాన్ని గతంలో మొక్కుబడిగా జరిగేది..గత పది సంవత్సరాలనుంచి అహోబిళం పీఠాదిపతికి తిరుమల దేవస్ధానం అదికారులు భారీగా ఆహ్వానం పలుకుతున్నారు..అహోబిళ క్షేత్రానికి తిరుమల వెంకటేశ్వరస్వామికి ఎంతో సాన్నిహిత్యం ఉంది..గతంలో పెద్దపెద్దమేదావులు ఈవిషయం చెప్పేవారు..ఇప్పుడు ఆలయ ప్రధాన పూజారి కిడాంబి వేణుగోపాల స్వామి ఆలయ ప్రత్యేక అదికారి సేతురామన్ తోపాటుగా పలువురు అదే సాంప్రదాయంను ఇప్పటి భక్తులకు వివరించడంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు..ఈసారి పారువేటను అదికారికంగా పండుగగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీచేసింది..ఇది అహోబిళం క్షేత్రానికి పెద్ద క్రెడిట్ గానే చెప్పవచ్చు..అలాగే తెలంగాణా ప్రభుత్వం కూడా నరసింహస్వామికి తమ భక్తిని చాటుకుంటూ పట్టు వస్త్రాలను పంపడం జరిగింది..స్థానిక ఎంఎల్ఎ, మాజీ ఎంఎల్ సి గంగుల బిజేంద్రానాదరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి సిపారుసులు కూడా ప్రభుత్వ స్పందనకు కారణం అయ్యాయి..ఎపి,తెలంగాణా మంత్రులు రోజా కొండా సురేఖ తోపాటుగా టిటిడి ఈఓ దర్మారెడ్డి కూడా సహకారం అందించారు..ఈ రెండు ప్రభుత్వాలు ముందుకు రావడానికి సేతురామన్ కీలక భూమిక పోషించారని ఆలయ వర్గాలు తెలిపాయి..