♦జనాస్ఘ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔జోష్ నింపుతున్న బైరెడ్డి
⇔అసంతృప్తులపై దృష్టి
⇔స్వపక్షంలో రాజీలతో పరుగులుతీస్తున్న బైరెడ్డి
నిస్తేజంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎంపి అభ్యర్ధిగా బైరెడ్డి శభరిని రంగంలోకి దిగిన తరువాత పార్టీకి ఏడు నియోజకవర్గాలలో జోష్ స్టార్ అయ్యిందని ఆపార్టీ నాయకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు..ఉద్యమాల నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూతురుగా శబరి కూడా ప్రసంగాలతో పాటు దూసుకునిపోయే మనస్థత్వం ఆపార్టీ నాయకులకు ఆనందం కలిగిస్తున్నది..ఇంతకాలానికి మంచి నాయకుడు వైసిపిని డీ అంటే …డీ అనే నాయకుడు రావడం మాకు ఆనందం కలుగుతున్నదని పార్టీ అదినేత చంద్రబాబునాయడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వలన ఈ ఊపు వచ్చిందని వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు..ఒకవైపు ప్రత్యర్ధిపార్టీలోని అసంతృప్తులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడంతోపాటు చెట్టుకొకడు,పుట్టకొకడు తగులుకున్న టిడిపి నాయకులను ఒకచోటుకి చేర్చడంలో సపలీకృతులు అవుతున్నారు..బైరెడ్డి శబరికి ప్రచార భాద్యతలను అప్పగించడంతోపాటు ప్రతిరోజు వై యస్ ఆర్ సిపి అసెంబ్లీ,పార్లమెంటు అభ్యర్ధులపై ఎలా ఎదురుదాడి చేయాలనే అంశాలపై ట్రైనింగ్ ఇస్తూ ముందుకు సాగిస్తున్నారు..బైరెడ్డి మాత్రం ముందుగా దూరం దూరం ఉంటున్న భూమా బ్రహ్మానందరెడ్డి లాంటి నాయకులను పరూఖ్ తో కలుపుతూ ఇరిగెలరాంపుల్లారెడ్డితోపాటు మరికొంత మంది జనసేన పార్టీ నాయకులను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు..పార్లమెంటు నియోజకవర్గంలోని నందికొట్కూరు,డోన్, బనగానపల్లె ,పాణ్యం,శ్రీశైలం,నంద్యాల,ఆళ్లగడ్డ నియోజక వర్గాలలో వైసిపికి బలమైన నాయకులుగా భావిస్తున్న నాయకులను తమవైపు తిప్పుకోవడంతోపాటు తమపార్టీలోని అసెంబ్లీ అభ్యర్ధులకు దూరంగా ఉంటున్నవారిని కూడా తనవెంట ప్రచారానికి తిప్పుకోవడం ఆయనకు,పార్టీకి ప్లస్ అయిందని భావిస్తున్నారు..వైసిపికి బలమైన నాయకుడిగా భావిస్తున్న మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాధరెడ్డిలాంటి నాయకులను పార్టీలోకిచేర్చుకుని అసంతృప్తుల చిరునామాలతో ముందుకు వెళ్లి పార్టీని బలోపేతం చేస్తున్నారు..పోలింగ్ ముగిసేసరికి పలితం ఎలా ఉన్నా పార్లమెంటులో బైరెడ్డి శబరి తండ్రి రాజశేఖరరెడ్డే హీారోగా పార్టీలో నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.