♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔వైసిపిలోకి భూమా కిషోర్ రంగం సిద్ధం
⇔ముహుర్తం ఎప్పుడో
⇔సజ్జలను కలసిన కిషోర్
⇔కిషోర్‌ను కలిసిన పోచా, జగన్‌లు
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజేపి నాయకుడిగా కొనసాగుతున్న భూమా కిషోర్ రెడ్డి వైసిపిలో చేరడానికి రంగం సిద్ధం అయ్యింది. గత రెండు సంత్సరాల నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగే ఆలోచనతో నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఊయ్యలవాడ, శిరివెళ్ల, రుద్రవరం మండలాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటించి తన వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకున్నారు. 2024లో ఎన్నికల్లో తాను ఏదో ఒక పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడడం గ్యారెంటీ అని హామి ఇస్తు ప్రతి మండలంలో క్యాడర్‌ను కుడా పెంచుకున్నారు. అనేక గ్రామాలలో దేవాలయాల పునఃరుద్ధరణ రహదారుల మరమ్మతులు యువకులకుకిట్లు తదితర వాటిని పంపిణీ చేసి ప్రజల్లోకి దూసుకెళ్లారు. తమ ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసి పోకుండా సభలు, సమావేశాలు నిర్వహించి కొత్త జోస్‌ని నింపారు. అయితే టిడిపి నుంచి టిక్కెట్ రాకపోవడంతో అక్కడ ఇమడలేక తమ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి చేతులు కలపడానికి కిషోర్ రెడ్డి నిమగ్నమైయ్యారు. నాలుగు రోజుల క్రితం వైసిపి నుంచి తాడేపల్లికి రావాలని నేతలు ఆహ్వానించడంతో కిషోర్ రెడ్డి వెళ్లి సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసినట్లు సమాచారం. వారు కుడా ఐ ఫ్యాక్ టీంతో సర్వే చేయించి కిషోర్ బలబలాలను సమీకరించినట్లు సమాచారం. ఐ ఫ్యాక్ సంస్థ బలమైన నాయకుడిగా సమాచారం ఇవ్వడంతో కిషోర్‌కు బంధువైన జిల్లా పాల డైరీ ఛైర్మన్ ఎస్వీ.జగన్‌మోహన్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు కిషోర్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. సజ్జలతో, పోచా, జగన్‌లతో అతీ కీలకమైన అంశాలను కిషోర్ చర్చించినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా ఏ బాధ్యత అప్పగించిన గతంలో నా కోసం ఎలా చేశానో పార్టీకి కుడా అలా చేస్తానని హామి ఇచ్చినట్లు తెలుస్తొంది. అధికారికంగా కిషోర్ పార్టీలో చేరే విషయం పై ఇంకా స్పష్టత లేదు. అయితే ఈనెల 4వ తేదిన బనగానపల్లెకు సీఎం జగన్ వస్తుండడంతో అక్కడ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే 4వ తేది పర్యటన వాయిదా పడడంతో ఎప్పుడు ఎక్కడ వైసిపిలో చేరుతారో పార్టీ కానీ కిషోర్ నుంచి కానీ స్పష్టత రావాల్సి ఉంది.