♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔జనాస్త్రాలతో 6న బాబు రాక
⇔ఎవరి మీద ఫైర్
⇔నియోజకవర్గానికి 3,500 పైగా ఆహ్వానం
⇔నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం అసెంబ్లీల చర్చ
⇔పార్లమెంట్ అభ్యర్థి పై అభిప్రాయ సేకరణ
నాలుగు మాసాల క్రితం నంద్యాలో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సారి నంద్యాలకు ఈనెల 6న వస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన పది నుంచి 12 వేల మందితో వేరు వేరుగా ఇన్ఛార్జీలు ఎన్ఎండి ఫరూక్, భూమా అఖిల ప్రియ, గౌరు చరితల ఆధ్వర్యంలో భేటి కానున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జీల పనితీరును వారి సమక్షంలోనే కార్యకర్తలను అడిగి తెలుసుకోనున్నారు.
మూడు నియోజకవర్గాల్లో ఇంతవరకు జనాలతో సేకరించిన సమాచారంతో బాబు వస్తున్నట్లు సమాచారం. ఎవరి పై ఆగ్రహాం వ్యక్తం చేస్తారో నన్న భయం ఇన్ఛార్జిలను వెంటాడుతున్నది. అంతేకాక రాబీన్ శర్మ టీం సభ్యులు అందించిన సమాచారం మేరకు అభ్యర్థులతో వేరువేరుగా వన్ టు వన్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా సీనియర్ టిడిపి నాయకులను కలుపుకొని పోవడంలో ఇన్ఛార్జీలు విఫలం అవుతున్నారనే విషయం పై బాబు ఆగ్రహాం అధికంగా ఉండవచ్చని అంచనా.
→నంద్యాల అసెంబ్లీ, నియోజకర్గంలో ఫరూక్తో కలిసి భూమా బ్రహ్మానందరెడ్డి తిరుగకపోవడం ప్రధాన చర్చ జరుగవచ్చు
.→నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి రేసులో ఉన్న మాండ్ర శివనందా రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, కెవి.సుబ్బారెడ్డిలలో ఎవరైతే బాగుటుంది అనే అంశాన్ని కార్యకర్తల సమక్షంలో పెట్టవచ్చు. అయితే ఇప్పటికే కెవి సుబ్బారెడ్డి తనకే టిక్కెట్ లభించవచ్చని గత 2, 3 రోజుల నుంచి శ్రేయోభిలాషులకు ఫోన్ చేసి వివరించినట్లు తెలుస్తొంది.
→తెలుగుదేశం పార్టీకి అనేక సంవత్సరాల నుంచి వెన్ను దన్నుగా నిలుస్తున్న ఏవి సుబ్బారెడ్డితో పలు రకాల సూచనలు స్వీకరించే అవకాశం ఉంది. ఎన్ని కష్టాలైన ఎదుర్కొని టిడిపిలోనే ఉంటానని ఏవి ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. తన పై తన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో దుష్రచారం చేస్తున్నారని ఇలా చేసేవారు ఎవరైనా ముందుకు వస్తే కోటి రూపాయలు పందెం పెట్టినా విజయం సాధిస్తారని ఏవి చెప్పడం టిడిపి అభిమానూల్లో ధైర్యం నింపింది
→వైయస్ఆర్సిపి ఇన్ఛార్జిల పై వీరి పోరాటం పై కుడా అసంతృప్తిని బాబు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.
→ఒక్కొక్కనియోజకవర్గంనుంచి3,500మందికితక్కువకాకుండాసమావేశానికిఆహ్వానించాలనిపార్టీలోనిఅన్నివర్గాలకుచెందిననాయకులువేరుగాచూడకుండాసమావేశానికిపిలువాలనిబాబు ఆదేశించినట్లు సమాచారం. మొత్తం మీద జనాస్త్రాలతో వస్తున్న బాబు ఇన్ఛార్జీల పై అగ్గిమీద గుగ్గిలం అవుతారని కార్యకర్తల అంచన.
Post Views: 1,310
Like this:
Like Loading...