♥ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦ ప్రవీణ్ రోహిత్ లకు యమా క్రేజ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువ పూజార్లుగా కొనసాగుతున్న ప్రవీణ్ శర్మ, పురోహిత్ శర్మలకు యమా క్రేజ్ పెరుగుతున్నది…గతంలో సీనియర్ పూజారులను వివాహాలకు గృహప్రవేశాలకు ,వ్యాపారసంస్థల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించి వారితో పూజలు నిర్వహించుకునే వారు…ఇప్పుడు వారితో పాటు నంద్యాలపట్టణంలోని వివరీతంగా భక్తులు కలిగి ఉన్న ప్రధమనంది ఆలయ పూజారి ప్రవీణ్ శర్మను, దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ పూజారి రోహిత్ శర్మలను తమ సంస్థలకు ఆహ్వానించుకుని పూజలు జరుపుకుంటున్నారు..వీరిద్దరిలో పూజలపై అవగాహన ఉండడంతోపాటు ఓర్పుతో పూజలు నిర్వహిస్తున్నారు..రోహిత్ అయితే వేదంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు..కొత్తూరులో కీలకమైన పూజలలో రోహిత్ పాల్గొనడానికి నారాయణస్వామి,సురేష్ శర్మలు అవకాశం కల్పిస్తున్నారు..ఈయన హైదరాబాదులో కూడా పూజలలో పాల్గొంటున్నారు..ఇదే పరిస్థితి ప్రధమనంది ప్రధాన పూజారి ప్రవీణ్ శర్మ కూడా పౌరోహిత్యం అదికంగా ఉంది..ఆలయంకు వచ్చే భక్తులకు కులమత ప్రసక్తి లేకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా పూజలు నిర్వహిస్తుండటంతో పాటు తిరుపతికి పాదయాత్ర ద్వారా కూడా పలుదపాలుగా వెళ్లడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంటున్నారు..మొత్తం మీద ఎంతో మంది ప్రముఖ పూజారుల సరసన చేరుకుంటూ పేరు ప్రఖ్యాతులు సాదించుకుంటున్న వీరిద్దరిపై భక్తుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..