♣ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♦ 35లక్షల బిల్వాలతో ఇప్పటివరకు బిల్వార్చన
♦ 600 మందికి పైగా పూజారులు పాల్గొన్నారు
♦ ఒక్క పైసాకూడా విరాళం లేకుండా
♦ ఇంతవరకు 2లక్షలమందికి పైగా పాల్గొని ఉంటారు
♦ 25 ఏళ్ల నుంచి రవిశంకర అవధానే ప్రధాన అర్చకులు
సింహం సింగల్ గా వస్తుందంటారు …అనేక సందర్బాలలో గుంపులుగా వచ్చిన సందర్బాలు ఉంటాయి..కానీ నంద్యాలపట్టణంలోని రామకృష్ణా విద్యాసంస్ధల అదినేత డాక్టరు రామకృష్ణారెడ్డి 35 సంవత్సరాలనుండి సింగల్ గానే ఒంటిచేత్తో లక్షబిల్వార్చన,లక్షకుంకుమార్చన నిర్వహిస్తున్నారు..ఇందుకు అయ్యే వ్యయాన్ని ఆయన స్వంతం భరించడం విశేషం..దేశంలో ఎన్నో దేవాలయాలలో ఈ కార్యక్రమాలు చందాలరూపంలోను నిర్వహిస్తుంటారు..ఇంతవరకు రామకృష్ణారెడ్డి ఆయన సతీమణి విజయలక్ష్మి ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కరితో ఒక్క పైసాకూడా విరాళం వసూలు చేయకుండా 35లక్షల బిల్వాలతో,35లక్షల సార్లు కుంకుమార్చనలు నిర్వహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు..35 సంవత్సరాలలో కనీసం రెండు లక్షల మంది భక్తులు కూడా ఈ భారీ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లు దేవాలయం వర్గాలు తెలుపుతున్నాయి..ఇంతవరకు దాదాపు 600 నుంచి 800 మంది పూజారులు ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని ఉండవచ్చని అంచనా …లక్షబిల్వాలకోసం ప్రతి యేటా 200 మంది బిల్వ వృక్షాలు చుట్టూ తిరుగుతూ బిల్వాలను సేకరిస్తున్నారు..మొత్తం మీద ఇందులో 25 సంవత్సరాలు పైగా ఆలయ ప్రధాన అర్చకుడు రవిశంకర్ అవదాని ఈ పూజను నిర్వహించారు..పూజనిర్వహణకు దాదాపు ఇప్పటి ఈఓ నల్వకాల్వ శ్రీనివాసరెడ్డితోపాటు గత ఈఓ చంద్రశేఖరరెడ్డి ప్రసాదుతో పాటు మరో 10 మంది పాలుపంచుకున్నారు..మొత్తం మీద 24 గంటలపాటు రామకృష్ణారెడ్డితోపాటు ఆయన సతీమణి విజయలక్ష్మి తనయుడు హేమంతరెడ్డి,కోడలు ప్రగతిరెడ్డితోపాటు ఇతరదేశాలలో ఉన్న వంశీదర్ రెడ్డి ఆయన సతీమణి లీనా కూడా లైవ్ లో ఈ వేడుకను తిలకిస్తూ కార్యక్రమానికి పరోక్షంగా సహకారం ఇస్తున్నారు..ఎప్పుడో ఒకసారి ప్రపంచ రికార్డులలో నమోదు కావడం సాద్యమేనని కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్యతోపాటు మాజీ ప్రిన్సిపల్ రామసుబ్బారెడ్డి తదితరులు పేర్కొంటున్నారు…