♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔అన్ని గ్రామాలలో మెజారిటీ కోసం కార్యకర్తల కృషి
⇔ఎప్పడు పిలిచినా పలికే వ్యక్తి కాటసాని
⇔భారీ అబివృద్దిని చేశారు..
⇔గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారు..
⇔గత మెజారిటీ సాదింపే లక్ష్యం
పాణ్యం వైయస్ ఆర్ సిపి అభ్యర్ధి కాటసాని రాంభూపాల్ రెడ్డి భారీ మెజారిటీతో ఏడవసారి విజయం సాదించబోతున్నారని పాణ్యం మాజీ జడ్ పిటిసి సభ్యులు వైయస్ ఆర్ సిపి నాయకులు సద్దల సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు..బుదవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు , పాణ్యం,గడివేముల మండలాలలోని అన్ని గ్రామాలలో,కల్లూరు పట్టణంలోని 16 వార్డులలోని ఇంచార్జిలు, కార్యకర్తలు,నాయకులు,కులం,మతం సంబందం లేకుండా రాంభూపాల్ రెడ్డిని తమ కుటుంబసభ్యులుగా భావిస్తున్నారని ప్రచారంలో కూడా ఒకరు కాకుండా కుటుంబ సభ్యులతో ద్వితీయ,తృతీయ శ్రేణి నాయకులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు..2019 లో 43వేల మెజారిటీ సాధించి జిల్లాలోనే అత్యదిక మెజారిటీ సాధించిన అభ్యర్ధిగా రాంభూపాల్ రెడ్డి నిలిచారని ఈసారికూడా ఇదే విదంగా మెజారిటీని సాదిస్తారనే ఆశాభావాన్ని సూర్యనారాయణరెడ్డి వ్యక్తంచేశారు..గతంలోొ కంటే ఈసారి అదికంగా పనులు చేశారని ,ప్రజలు ఏసమయంలో పిలచినా వారిని పోన్ ద్వారా గాని, స్వయంగా గాని పలకరించడంలో రాంభూపాల్ రెడ్డి తరువాతనే నని సూర్యనారాయణరెడ్డి అన్నారు..తాను కూడా అన్ని పనులు మానుకుని పాణ్యం నియోజకవర్గంలో తనకు పరిచయం ఉన్న వారందరితో వైౌసిపికి బలం చేకూర్చూలని ప్రచారం చేస్తున్నట్లు సూర్యనారాయణరెడ్డి తెలిపారు..ఓడిపోతామని తమ ప్రత్యర్ధులు దుష్ప్రచారం చేస్తున్నారని కౌటింగ్ రోజున కాటసాని బలం ఏందో తెలుస్తుందని అన్నారు…