♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔భారీ ఎత్తున తరలివస్తున్న జనం
⇔60 వేలకు పైగా ఇండిపెండెంటుగా పోటీచేస్తే ఓట్లు వచ్చాయి.
పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ ఆర్ సిపి అభ్యర్ధి కాటసాని రాంభూల్ రెడ్డి సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారని ఈ జనాన్ని చూస్తే ఆయన మెజారిటీ ఆకాశమే హద్దుగా ఉండవచ్చని ప్రముఖ పూజారి కొత్తూరు నారాయణస్వామి అన్నారు..బుదవారం కొత్తూరు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాంభూల్ రెడ్డి కాకుండా ఆయన కుమారుడు శివనరసింహారెడ్డి,కూతురు మాధవిలత, భార్య ఉమామహేశ్వరమ్మ తదితరులు గ్రామాలకు వెళ్లినా భారీగా ప్రజలు తరలివచ్చి స్వంతంగానే వారి అభిప్రాయాన్ని మీకు మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారని అన్నారు..గతంలో మించి ఈసారి జనం రావడం చూస్తే భారీ మెజారిటీ పాణ్యం మండలమేకాకుండా గడివేముల, ఓర్వకల్లు ,కల్లూరు మండల కేంద్రాలతోపాటు గ్రామాలలో కూడా మెజారిటీ వస్తుందని ప్రజలమనిషిగా గుర్తింపు పొందిన రాంభూపాల్ రెడ్డికి 2014 లో ఇండిపెండెంటుగా పోటీచేస్తే 60 వేల ఓట్లు పోలు అయ్యాయని అన్నారు..ఇన్ని ఓట్లు రావడం గత రెండు,మూడు ఎన్నికలలో జరగలేదన్నారు..ఈసారి కూడా ఆయనను ప్రజలే స్వచ్చందంగా భారీ మెజారిటీతో గెలిపించే ఆలోచనతో ఉన్నారని పోలింగ్ తేదికోసం తహతహ లాడుతున్నారని నారాయణస్వామి తెలిపారు…