♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔భక్తిలో అరుదైన రికార్డు కాటసాని
⇔33 ఏళ్ల నుంచి యాగంటేశ్వరుడి దీక్షలు
⇔1300 రోజుల దీక్షలు
⇔గిన్నిస్, లిమ్కా రికార్డులకు అర్హుడే
ఆరు సార్లు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడవ విజయం కోసం ఎదురుచుస్తున్న వైయస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే ఈశ్వర భక్తుడుగా 33 సంవత్సరాలు యాగంటి ఉమామహేశ్వర స్వామి దీక్షను చేపడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఏ ప్రజా ప్రతినిధి చేపట్టని విధంగా అరుదైన రికార్డును సృష్టించారు. ఈ విషయంలో ప్రచార యావలేని కాటసాని ప్రశాంతంగా ప్రతి సంవత్సరం 40 రోజులకు పైగా ‘సాదారణ ఆహారంతో సోమవారం ఉపవాసాలతో దీక్షను కొనసాగిస్తుంటారు. పూజ కుడా రోజుకు 2, 3 గంటలు నిర్వహిస్తారు. కనీసం పది శైవ క్షేత్రాలకు దీక్ష సమయంలో వెళ్లి వస్తారు. గత 4, 5 సంవత్సరాల నుంచి శ్రీశైలంకు వెంకటాపురం నుంచి నడిచి వెళ్లడం ఈయన ప్రత్యేకత. గత ఏడాది కాలికి ముల్లు, గాజు సీసాలు కుచ్చుకొని రక్తం కారుతున్న తనకు ఇష్టమైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకోవడం జరిగింది. 1991 నుంచి ఈ దీక్షను కొనసాగిస్తూ ఇప్పటి వరకు 1300 రోజులు దీక్షలో ఉన్నట్లు పూజారులు అంటున్నారు. ఇంత కఠినంగా ఏ స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం దీక్ష కొనసాగించే వ్యక్తి కాటసాని రాంభూపాల్ రెడ్డి అని కొత్తూరు దేవస్థానం ప్రధాన అర్చకుడు నారాయణ స్వామి పేర్కొన్నారు. ప్రపంచ రికార్డును కుడా ఒక రాజకీయ నాయకుడిగా ఇన్ని సంవత్సరాలు దీక్షను చేపట్టిన వారిలో రాంభూపాల్ రెడ్డి ఉంటారని అన్నారు. ఫాలో అప్ చేసి ఉంటే గిన్నిస్, లిమ్కా రికార్డులలో ప్రజా ప్రతినిధిగా అరుదైన అవకాశం దక్కేదని కుడా నారాయణ స్వామి అన్నారు. రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ తన అంతిమ శ్వాస వదిలే వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని యాంగటేశ్వరుడి ఆశీస్సుల వల్లే ఎవరికి దక్కని ఎమ్మెల్యే అవకాశం తనకు దక్కిందని అన్నారు. తన కటుంబ సభ్యులు పాణ్యం నియోజకర్గ ప్రజలు, నా స్నేహితులు ఇస్తున్న బలం వల్ల తాను ఈ దీక్షను స్వీకరిస్తున్నానని వీందరూ కుడా ఆయుర్, ఆరోగ్య, ఐశ్వర్యాలతో కొనసాగాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.