జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
మొండివాడు …గట్టి వాడైన ఇండియన్ కామన్ మ్యాన్ యు ట్యూబ్ చానల్ అదినేత పాలూరి రామమోహన్(రమణ) చేస్తున్న పోరాటం ఎంతకాలం సాగుతుందోనన్న చర్చ సాగుతున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఇంటినుంచి కాకుండా సచివాలయం నుండి విదులు నిర్వహించాలని, ప్రస్తుతం మూడేళ్లనుంచి అమ్మకాలు జరుపుతున్న మద్యంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని వారికి విముక్తి కల్పించే విదంగా ఆరోగ్యవంతమైన లిక్కర్ బ్రాండ్లను వ్యాపారంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈరెండు సబబైన డిమాండ్లే అయితే వీటిలో ప్రజలకు న్యాయంచేయాలని కోరుకుంటూ కర్నూలుపట్టణంలోని ఆయన స్వగృహంలో 24 గంటల క్రితం నిరాహార దీక్షను ఆరంభించారు..ముందుగా ఆయన ఇచ్చిన అల్టిమేటం అయితే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎదురుగా దీక్షచేయాలని నిర్ణయించుకున్నారు..ఆతరువాత కర్నూలు పట్టణంలోని ప్రదాన కూడలిలో ఏదో ఒకచోట దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు..చివరి నిమిషంలో తనదీక్షకు ప్రభుత్వ పరంగా అడ్డంకులు ఎదురవుతాయని కొన్ని గంటలపాటైన తాను దీక్షను చేయలేననే అపనమ్మకంతో తన ఇంట్లోనే నిరాహార దీక్షను ఆరంభించారు..ప్రభుత్వ అదికారులు వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికితెచ్చి పరిష్కరించాలని పలువురు సూచిస్తున్నారు..వివిద రాజకీయ పార్టీలలు ప్రజా సంఘాలు పాత్రికేయులురంగ ప్రవేశం చేసి ముందుగా రమణ ఆందోళనకు మద్దతు ఇచ్చి ఆయన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరిాంచాలని పలువురు కోరుతున్నారు..ఏది ఏమైన రమణ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించాలని నంద్యాల,ఆళ్లగడ్డకు చెందిన పలువురు మేధావులు రాజకీయ పరిశీలకులు కోరుతున్నారు..