జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
#పదిరోజులలో మున్సిపల్ సమావేశం జరిగేనా?
#అనధికారిక మొత్తాల విడుదలపై వివరణ వచ్చేనా?
#ఆ తరువాత దేశం సులోచన వైఖరి ఏమిటి?
వైయస్ ఆర్ సిపి నాయకురాలు మాజీమంత్రి శిల్పామోహనరెడ్డి, ఎంఎల్ఎ రవిచంద్ర కిషోర్ రెడ్డిలకుతలలో నాలుకలాంటి 18వవార్డు కౌన్సిలర్ దేశం సులోచన గతనెల 31 వతేది నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి, శిల్పాకుటుంబానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి వ్యక్తులు అయినా విరుచుకుపడే దేశం సులోచనలో ఎందుకు ఇంత మార్పు వచ్చిందనే విషయంపై రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది…మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, మునిసిపల్ కమీషనర్ రవిచంద్రారెడ్డి లు జోక్యంచేసుకుని తాను చేస్తున్న ఆరోపణలకు సమాదానం శ్వేతపత్రం ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు..అంతేకాక మున్సిపల్ సమావేశాన్నిపదిరోజులలోనే నిర్వహించాలని డిమాండ్ చేయడంతో సమావేశంలో పాల్గొన్న దాదాపు 38మంది కౌన్సిలర్లు ఉన్నారు..ఇందులో ఎంఎల్ఎ రవిచంద్ర సతీమణి కౌన్సిలర్ నాగినిరెడ్డికూడా ఉండటం విశేషం.మొత్తంమీద రూ.40లక్షలనుండి రూ.50లక్షలవరకు అనధికారికంగా విత్ డ్రా చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఇటువంటి పద్దతులతో మనం అసెంబ్లీ ఎన్నికలను ఎలా పేస్ చేస్తామని చివరికి ముఖ్యమంత్రికి చెడ్డపేరు వచ్చేవిధంగా ఉన్నదని ఆమె హెచ్చరించడంతో ఆమె గురి ఎవరిపై అన్న సందేహం పలువురిలో వ్యక్తం అవుతున్నది.నంద్యాలలో శిల్పా విసిరిన బాణంగా దేశం సులోచనను చర్చించుకుంటుంటారు..అటువంటి కౌన్సిలర్ ఇటువంటి ఆరోపణలు చేయడం అధికారపార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు.కొద్ది మాసాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో సులోచన చేసిన ఆరోపణలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి.ఒకవేళ సులోచన డిమాండ్లను అమలుచేయకుంటే పదిరోజలతరువాత ఏమిచేస్తారు అనే చర్చ జరుగుతున్నది..సమావేశం జరపకుండా, అనధికారిక మొత్తం విడుదలలో ప్రకటన చైర్మన్, అధికారులు చేయకుంటే కూడా దేశం సులోచన వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై చర్చ సాగుతున్నది..ఎంఎల్ఎ, మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి,రవిచంద్ర కిషోర్ రెడ్డిలు రంగంలోకి దిగి సులోచనను ఈ సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.మొత్తం మీద దేశంసులోచన చేసిన ఆరోపణలు ప్రతిపక్షాలు ఏవిధంగా ఉపయోగించుకుంటాయో వేచి చూడాల్సిందే.బెస్ట్ ఆప్ లక్ సులోచన..